Viral Video: పెళ్లికొచ్చిన బంధువులకు రిటర్న్‌ గిఫ్ట్‌.. అదిరిందిగా..! వీళ్లు మామూలోళ్లు కాదుగా..

Viral Video: పెళ్లికొచ్చిన బంధువులకు రిటర్న్‌ గిఫ్ట్‌.. అదిరిందిగా..! వీళ్లు మామూలోళ్లు కాదుగా..

Anil kumar poka

|

Updated on: Jun 07, 2023 | 9:47 PM

తమిళనాడులోని చెన్నైకి చెందిన నిర్మల్‌కు.. పుదుచ్చేరికి చెందిన ఆర్తికి వివాహం నిశ్చయమైంది. పుదుచ్చేరిలోని మహాలక్ష్మి వెడ్డింగ్ హాలులో మే 28 న పెళ్లి జరిపించారు. అనంతరం జరిగిన రిసెప్షన్‌లో హాజరైన అతిథులకు పెళ్లి కూతురు తరఫు బంధువులు ఒక కవర్‌ను అందించారు.

తమిళనాడులోని చెన్నైకి చెందిన నిర్మల్‌కు.. పుదుచ్చేరికి చెందిన ఆర్తికి వివాహం నిశ్చయమైంది. పుదుచ్చేరిలోని మహాలక్ష్మి వెడ్డింగ్ హాలులో మే 28 న పెళ్లి జరిపించారు. అనంతరం జరిగిన రిసెప్షన్‌లో హాజరైన అతిథులకు పెళ్లి కూతురు తరఫు బంధువులు ఒక కవర్‌ను అందించారు. అందులో తాంబూలంతోపాటు మద్యం బాటిల్ ఉండటంతో అందర్నీ విస్మయానికి గురిచేసింది. సాధారణంగా పుదుచ్చేరిలో పెళ్లికి విచ్చేసిన అతిథులకు తమలపాకులతో కూడిన తాంబూలం ప్యాకేజీలు ఇవ్వడం ఆనవాయితీ. అందులో తమలపాకులు, పండ్లు, స్వీట్లు, పుస్తకాలు, పూలు ఉంటాయి. ఇందుకు భిన్నంగా ఈ పెళ్లిలో లిక్కర్ బాటిళ్లను పంపిణీ చేయడంతో పెళ్లికి వచ్చిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఈ మొత్తం తతంగానికి సంబంధించిన దృశ్యాలను అక్కడ పెళ్లికి హాజరైన వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే ఇక నెటిజన్ల కామెంట్లు, షేర్లతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. సాధారణంగా మద్యం తేలికగా దొరుకుతుందని చెన్నై వాసులు.. తరచూ పుదుచ్చేరికి వెళ్తుంటారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పండగలు, ఫంక్షన్లలో మద్యం అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాంటిదని మరికొందరు స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పెళ్లికూతురు మామ స్పందించారు. తమ బంధువులు మరియు చెన్నైకి చెందిన కొంత మంది మద్యం అందించాలని కోరినట్లు చెప్పారు. అందుకే ఈ విధంగా వచ్చిన అతిథులకు లిక్కర్ సీసాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పురుషులకు తాంబూలంతోపాటు అదే బ్యాగులో మద్యం బాటిల్ కూడా ఇచ్చినట్లు వివరించారు. మహిళలకు మాత్రం సాధారణంగా ఇచ్చే తాంబూలాన్ని ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది ముమ్మాటికీ సంప్రదాయాలను కించపరచడమేనని తమిళనాడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి నారాయణన్ ఆక్షేపించారు. సంస్కృతి, సంప్రదాయాలను అవమానపరిచే విధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పుదుచ్చేరి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.