Stars Disappearing: ఆకాశంలో ఇకపై నక్షత్రాలు కనిపించవా..! మాయం కానున్న నక్షత్రాలు..

Stars Disappearing: ఆకాశంలో ఇకపై నక్షత్రాలు కనిపించవా..! మాయం కానున్న నక్షత్రాలు..

Anil kumar poka

|

Updated on: Jun 07, 2023 | 10:06 PM

రాత్రివేళ రిలాక్స్‌ కోసం మేడపైకి వెళ్లి ఆకాశంలోకి చూస్తూ నిలబడితే.. వేల వేల నక్షత్రాలు మిమ్మల్ని ఎంతగానో అలరిస్తాయి. కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయి. వేల నక్షత్రాల నడుమ జాబిల్లి ఎంతో అందంగా కనిపిస్తాడు. కానీ కొన్నేళ్ల తర్వాత ఈ అద్భుత దృశ్యం ఇక కనిపించదంటున్నారు శాస్త్రవేత్తలు.

ది గార్డియన్ నివేదిక ప్రకారం…. బ్రిటీష్ ఖగోళ శాస్త్రవేత్త మార్టిన్ రీస్… “కాంతి కాలుష్యం కారణంగా సంవత్సరాలు గడిచేకొద్దీ… నక్షత్రాలు తక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. పెరుగుతున్న LEDలు, ఇతర కాంతి వనరుల వల్ల… రాత్రివేళ కూడా భూ ఉపరితలంపై కాంతి ఎక్కువవుతోందని, ఇది ఇలాగే పెరుగుతూ ఉంటే.. భవిష్యత్ తరాల వారికి ఆ కాంతిలో నక్షత్రాలు కనిపించవు అంటున్నారు. జర్మన్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్‌కు చెందిన క్రిస్టోఫర్ కాబా ప్రకారం… ఆకాశంలో నక్షత్రాల మెరుపు… భూమిపై నుంచి చూసేవారికి క్రమంగా తక్కువగా కనిపిస్తోంది. భూమిపై నుంచి ఇప్పుడు 500 నక్షత్రాలు చూడగలిగేవారికి… 18 ఏళ్ల తర్వాత… 200 నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయని కాబా అంచనా వేశారు. /Volumes/PRODUCTION/PROJECTS/Epic Heroic.mp3
Voice : పూర్వం సముద్రాల్లో నావికులు.. నక్షత్రాల ఆధారంగా… తాము ఏ దిశలో ప్రయాణిస్తున్నదీ గుర్తించేవారు. వారికి ఆకాశంలో నక్షత్రాలు చాలా స్పష్టంగా కనిపించేవి. ఇప్పుడు కాంతి కాలుష్యం బాగా పెరిగిపోయింది. పట్టణాలు, నగరాల్లో వారికి రాత్రివేళ దాదాపు నక్షత్రాలు పెద్దగా కనిపించట్లేదు. వాటిని చూడాలంటే… పల్లెలకు వెళ్లాల్సి వస్తోంది. కృత్రిమ కాంతి కారణంగా,.. సహజ కాంతి, కృత్రిమ కాంతి మధ్య తేడాను మనం గుర్తించలేమని పరిశోధకులు అంటున్నారు. వరల్డ్ అట్లాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ నైట్ స్కై నివేదిక ప్రకారం… ప్రపంచ జనాభాలో 80 శాతం మంది ఆకాశ కాలుష్యంతో బాధపడుతున్నారు. అంటే ఆకాశంలో అనవసరంగా కృత్రిమ కాంతి మెరుస్తోంది. దీన్ని స్కైగ్లో అంటున్నారు. ఇదే.. మనకు నక్షత్రాలను దూరం చేస్తోంది. స్కై గ్లో కారణంగా.. వెన్నెల రాత్రుల్లో ఒక చోటి నుంచి మరో చోటికి చేరుకునే వలస పక్షులు కూడా దారి తప్పుతున్నాయి. భూమి, ఆకాశంతో పాటు నీటిపైనా కృత్రిమ లైట్లు ప్రభావం చూపుతున్నాయి. జలచరాలు ఈ కాంతి వల్ల రాత్రిళ్లు ఇబ్బంది పడుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.