Shiva Prajapati |
Updated on: Jun 07, 2023 | 10:27 PM
చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకాలోని హోసకొప్ప గ్రామంలోని తోటలో భారీ కొండచిలువ కనిపించింది.
కాఫీ తోటలో కుక్కను తిని నిద్రిస్తున్న భారీ కొండచిలువ పట్టుబడింది.
దాదాపు 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ వింత శబ్ధాలు చేయడంతో భయపడ్డారు స్థానికులు. దాంతో ఏముందా అని వెతుకుతూ వెళ్లగా.. భారీ కొండ చిలువ కనిపించింది. దాంతో వారంతా ఉలిక్కిపడ్డారు.
అటవీశాఖ సిబ్బంది సమక్షంలో స్నేక్ క్యాచర్ కొండ చిలువను పట్టుకుని అడవిలో వదిలేశారు.
కొండచిలువ కుక్కను తిని బరువెక్కిన కడుపుతో విశ్రాంతి తీసుకుంది. ఇది గమనించిన కాఫీ తోట సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
అక్కడికి వచ్చిన స్నేక్ క్యాచర్ అర్జున్ ఎలాంటి ప్రమాదం లేకుండా కొండచిలువను పట్టుకున్నాడు. అనంతరం కొండచిలువను అడవిలోకి వదిలారు.