- Telugu News Photo Gallery Cricket photos Pakistan team young bowler naseem shah key comments on virat kohli out for a duck
Virat kohli: కింగ్ కోహ్లీని ‘జీరో’గా మార్చేస్తా.. కీలక కామెంట్స్ చేసిన పాక్ యువ బౌలర్..
Naseem Shah vs Virat kohli: గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల నసీమ్.. తన మెయిన్ టార్గెట్ విరాట్ కోహ్లీ అంటూ ప్రకటించాడు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో పాక్ పేసర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీని సున్నాకి అవుట్ చేయడమే నా బిగ్ డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చాడు.
Updated on: Jun 07, 2023 | 9:52 PM

India vs Pakistan: పాకిస్థాన్ 20 ఏళ్ల పేసర్ నసీమ్ షా తన చిన్న అంతర్జాతీయ కెరీర్‌లోనే సంచలనం సృష్టించాడు. 2019లో టెస్టు క్రికెట్‌లో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన నసీమ్.. ఇప్పుడు మూడు ఫార్మాట్లలో పాక్ జట్టులో శాశ్వత సభ్యుడిగా మారాడు.

గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల నసీమ్.. తన మెయిన్ టార్గెట్ విరాట్ కోహ్లీ అంటూ ప్రకటించాడు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో పాక్ పేసర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీని సున్నాకి అవుట్ చేయడమే నా బిగ్ డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చాడు.

భారత్‌తో ఆడేటప్పుడు నా ప్రాణాలను పణంగా పెడతానని, ఈసారి విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టడమే మా అందరి లక్ష్యం అంటూ ప్రకటించాడు. ముఖ్యంగా సున్నాకి ఔట్ చేయాలన్నది నా కల అంటూ చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీని డకౌట్ అవుట్ చేయడం అంటే.. ఎంతో గర్వించదగ్గ విషయం. అందువల్ల రాబోయే రోజుల్లో కింగ్ కోహ్లీని డకౌట్ చేస్తానని నసీమ్ షా ప్రకటించాడు.

వచ్చే ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతోపాటు భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లోనూ దాయాది పోరు ఉండనుంది. కాబట్టి నసీస్ షా కలను విరాట్ కోహ్లీ ఎలా ఛేదిస్తాడో వేచి చూడాలి.

పాకిస్థాన్ తరపున 15 టెస్టులు ఆడిన నసీమ్ షా మొత్తం 42 వికెట్లు పడగొట్టాడు. అలాగే 8 వన్డేల్లో 23 వికెట్లు, 19 టీ20ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. రాబోయే రెండు పెద్ద టోర్నీల్లో చాలా పెద్ద కలతో టీమ్ ఇండియాతో పోటీ పడాలని కోరుకుంటున్నాడు.





























