- Telugu News Photo Gallery Multiple hearts: some of the animals have more than one heart know details
Multiple Hearts: ఒకటి కంటే ఎక్కువ జీవులు కలిగిన విచిత్ర జీవులు.. వివరాలివే..
ఇది మనకు వింతగా అనిపించవచ్చు.. కానీ అన్ని జంతువులకు ఒకటి కంటే ఎక్కువ హృదయాలు ఉంటాయి. మీరు చూసే వాటిలో చాలా జీవులకు.. ఒకటి కంటే ఎక్కువ హృదయాలు ఉంటాయి. మరి ఆ జీవులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: Jun 07, 2023 | 10:32 PM

ఆక్టోపస్: ఆక్టోపస్‌లో 3 హృదయాలు ఉంటాయి. ఆక్టోపస్‌లలో వందల జాతులు ఉన్నాయి. కానీ, అన్నింటికీ మూడు హృదయాలున్నాయి.

వానపాములు: వానపాములో హృదయాల సంఖ్య 5. బహుళ హృదయాలు కలిగిన అత్యంత సాధారణ జీవులలో ఇది ఒకటి. ఈ డికంపోజర్లు దాదాపు ప్రతిచోటా కనిపిస్తాయి. వానపాములకు 5 హృదయాలు ఉంటాయి.

స్క్విడ్: ఇందులో హృదయాల సంఖ్య 3. ఆక్టోపస్‌లో ఉన్నట్లే ఇందులోనూ సమానంగా ఉంటాయి. వీటి పనితీరు కూడా ఒకేవిధంగా ఉంటుంది.

కటిల్ ఫిష్: ఇందులో హృదయాల సంఖ్య 3. కటిల్ ఫిష్ బహుళ హృదయాలను కలిగి ఉన్న మరో రెండు జంతువులను పోలి ఉంటుంది. ఆక్టోపస్, స్క్విడ్ మాదిరిగానే ఇందులో హృదయాలు ఉన్నప్పటికీ.. అవి ఒకే విధంగా ఉండవు. కటిల్ ఫిష్‌కి మూడు హృదయాలు మాత్రమే ఉంటాయి. కటిల్ ఫిష్ ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా ఉంటుంది.

స్క్విడ్ సముద్రాలలో ఉంటుంది. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. కొన్ని మాత్రం అసహజంగా భారీగా పెరుగుతాయి. ప్రసిద్ధ జెయింట్ స్క్విడ్ భూమిపై అతిపెద్ద జీవులలో ఒకటి. ఇది బహుళ హృదయాలు కలిగిన పెద్ద జంతువు.

అత్యధిక సంఖ్యలో హృదయాలను కలిగి ఉన్న జీవి బొద్దింక. ఇందులో హృదయాల సంఖ్య 13. అందుకే ఇవి అంత త్వరగా చనిపోవు. అయితే బొద్దింకకు ఒకే గుండె ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ దాని గుండెలో 13 గదులు ఉన్నాయని వివరణ ఇస్తున్నారు. ఈ గదులు వరుసగా అమర్చబడి ఉంటాయి. ప్రతి గది పంక్తిలో ఉన్న గదికి రక్తాన్ని పంపుతుంది. ఈ విచిత్రమైన వ్యవస్థ వాటిని అత్యంత స్థితిస్థాపకంగా చేస్తుంది.




