Health Tips: మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకుంటున్నారా? ఈ మ్యాటర్ తప్పక తెలుసుకోవాల్సిందే..

చాలా మంది బయటకి వెళ్లినప్పుడో, ఇతర పనుల నేపథ్యంలోనో మూత్రాన్ని నియంత్రించుకుంటారు. అయితే, దీనివల్ల అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. డయాబెటిస్ కారణంగా గానీ, నీరు ఎక్కువగా తాగడం వల్ల గానీ, ఇతర కారణాల వల్ల గానీ మూత్రం తరచుగా వస్తుంటుంది.

Health Tips: మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకుంటున్నారా? ఈ మ్యాటర్ తప్పక తెలుసుకోవాల్సిందే..
Urine Control
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 11, 2023 | 9:24 PM

చాలా మంది బయటకి వెళ్లినప్పుడో, ఇతర పనుల నేపథ్యంలోనో మూత్రాన్ని నియంత్రించుకుంటారు. అయితే, దీనివల్ల అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. డయాబెటిస్ కారణంగా గానీ, నీరు ఎక్కువగా తాగడం వల్ల గానీ, ఇతర కారణాల వల్ల గానీ మూత్రం తరచుగా వస్తుంటుంది. అయితే, మూత్ర విసర్జన చేయకుండా అలాగే అదిమిపెట్టుకుంటే.. తీవ్రమైన రోగాలను ఆహ్వానించినట్లే అవుతుందని చెబుతున్నారు నిపుణులు. మూత్ర విసర్జనను నియంత్రించడం వల్ల ఏయే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో ఇవాళ మనం తెలుసుకుందాం..

బలహీనమైన మూత్రాశయం..

మూత్రాశయంలోనే మూత్రం నిలువ ఉంటుంది. ఎక్కువ సమయం నిలువ ఉంచడం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా బలహీనంగా మారుతుంది. కొన్నిసార్లు మూత్రాశయం పగిలిపోయే ప్రమాదం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

మూత్ర నాళాల ఇన్ఫెక్షన్..

ప్రజలు ఎదుర్కొనే అత్యంత సాధారణ సమస్యలలో ఇది ఒకటి. వాస్తవానికి, శరీరంలోని టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటకు వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ సమయం మూత్రాన్ని నిలుపుకోవడం వలన pH స్థాయి చెదిరిపోతుంది. ఇది UTI సంక్రమణ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మూత్రపిండాల వైఫల్యానికి కారణం..

కిడ్నీలు మన శరీరంలో వడపోత పని చేస్తాయి. ఎక్కువసేపు మూత్రాన్ని నియంత్రించుకోవడం వలన మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాదు, ఇలా ఎక్కువ సమయం మూత్రాన్ని నియంత్రిస్తే.. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది.

శరీరంలో వాపు..

మన శరీరంలో పేరుకుపోయిన సోడియం మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. ఎక్కువ సమయం మూత్రాన్ని నియంత్రించినప్పుడు, శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల శరీరంలో వాపు సమస్య పెరుగుతుంది.

జననేంద్రియాల్లో నొప్పి..

ఎక్కువ సమయం మూత్రాన్ని నియంత్రించడం వలన మూత్రాశయం మీద ఒత్తిడి ఉంటుంది. కొన్నిసార్లు ఇది నొప్పికి దారితీస్తుంది. దిగువ ఉదరం, జననేంద్రియాలలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..