AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: డయాబెటిస్‌ ఉన్నవారు మద్యం తాగొచ్చా..? తాగితే ఏమవుతుంది..?

డయాబెటిస్‌.. ఇది ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. భారతదేశం వ్యాప్తంగా దాదాపు 10 కోట్లకుపైగా మధుమేమం బారిన పడిన వారున్నారని నివేదికలు చెబుతున్నాయి..

Diabetes: డయాబెటిస్‌ ఉన్నవారు మద్యం తాగొచ్చా..? తాగితే ఏమవుతుంది..?
Diabetes
Subhash Goud
|

Updated on: Jun 11, 2023 | 9:34 PM

Share

డయాబెటిస్‌.. ఇది ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. భారతదేశం వ్యాప్తంగా దాదాపు 10 కోట్లకుపైగా మధుమేమం బారిన పడిన వారున్నారని నివేదికలు చెబుతున్నాయి. రోజురోజుకు ప్రపంచాన్నే కమ్మేస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. డయాబెటిస్‌ బారిన పడిన వారు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. జీవనశైలి మార్చుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఇష్టానుసారంగా ఆహారం తీసుకోవడం వల్ల ప్రాణాలకే ముప్పు ఉండే ప్రమాదం ఉందంటున్నారు. డయాబెటిస్‌ అదుపులో లేకపోతే కిడ్నీ ఫెయిలయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు.. మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మధుమేహం ఉన్నవారు ఆహార నియమాలతో పాటు పానీయాలకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్యులు.

డయాబెటిస్‌ ఉన్నవారు మద్యం తాగోచ్చా..?

డయాబెటిస్‌ ఉన్నవారు మద్యం తాగొచ్చా ? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మద్యం తాగడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక వేళ ముందే డయాబెటిస్‌ ఉన్నట్లయితే మద్యానికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. మద్యం తాగినా మధుమేహం సమస్య పెరిగే అవకాశాలు ఉండవచ్చు. మధుమేహం వచ్చిన వారిలో సమస్య వారి నాడులు, నాడీ కణాలు దెబ్బతింటాయి. మధుమేహం ఉన్నవారు మద్యం తాగితే రెట్టింపు వేగంతో నాడులు దెబ్బతింటాయంటున్నారు. దీని కారణంగా ఒళ్లంతా మంటలు పుట్టడం, తిమ్మిర్లు ఎక్కువగా రావడం, అలాగే సూదులతో పొడిచినట్టు అనిపించడం వంటి సమస్యలు మొదలవుతాయి. పరిస్థితి ఇంకా ముదిరినట్లయితే కాళ్లు, పాదాలు మొద్దుబారడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.

అనుకోకుండా మద్యం తాగాల్సి వస్తే..

ఒక వేళ మధుమేహం ఉన్నవారు అనుకోకుండా మద్యం తాగిల్సి వస్తే కొద్దిసేపటి తర్వాత పుష్టిగా భోజనం చేయాలి. ఆ తర్వాత డయాబెటిస్‌కు సంబంధించిన మందులు వేసుకోవాలి. మద్యం తాగిన తర్వాత భోజనం చేయకుండా మందులు వేసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం తాగిన తర్వాత మందులు వేసుకున్నట్లయితే ఇవి రెండు కూడా కొత్త సమస్యలను సృష్టించే ప్రమాదం ఉంది. దీని వల్ల ఛాతీలో మంట రావడం, వాంతులు, కొన్ని సందర్భాలలో రక్తపు వాంతులు కూడా అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మద్యంతో గ్లూకోజ్‌ ఉత్పత్తికి ఆటంకం..

మన శరీంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఎప్పుడు కూడా గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మద్యంలో కాలేయానికి చేరుతుందో ఆ ప్రక్రియకు ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంలో గ్లూకోజ్‌ ఉత్పత్తి సరిగ్గా జరగదు. అలాంటి సమయంలో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి ఒక్కసారిగా పడిపోయే ప్రమాదం ఉంది. దీని కళ్లు సరిగ్గా కనిపించకపోవడం, కళ్లు తిరిగినట్లుగా అనిపించడం మొదలవుతాయి. మద్యం అలవాటు ఉన్నవారు ఎప్పుడో ఒకసారి పెగ్‌ తీసుకోవచ్చు కానీ.. అదే పనిగా మద్యం తాగినట్లయితే ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..