AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Married Life: ఈ 5 వ్యాయామాలు మీ లైంగిక శక్తిని రెట్టింపు చేస్తాయి.. వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది..

బిజీ లైఫ్, సరికాని జీవనశైలి, సమయపాలన లేని తిండి.. వెరసి చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. 35 సంవత్సరాలకే గుండెపోటుకు గురవుతున్నారు. దాంతోపాటు అనేక ఇతర తీవ్రమైన వ్యాధులను సైతం ఎదుర్కొంటున్నారు. దీనంతటికీ కారణం అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో మార్పులు. ఇది లైంగిక జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. భార్య, భర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది.

Married Life: ఈ 5 వ్యాయామాలు మీ లైంగిక శక్తిని రెట్టింపు చేస్తాయి.. వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుంది..
Men Health
Shiva Prajapati
|

Updated on: Jun 11, 2023 | 6:48 PM

Share

బిజీ లైఫ్, సరికాని జీవనశైలి, సమయపాలన లేని తిండి.. వెరసి చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. 35 సంవత్సరాలకే గుండెపోటుకు గురవుతున్నారు. దాంతోపాటు అనేక ఇతర తీవ్రమైన వ్యాధులను సైతం ఎదుర్కొంటున్నారు. దీనంతటికీ కారణం అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో మార్పులు. ఇది లైంగిక జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. భార్య, భర్తల మధ్య దూరాన్ని పెంచుతుంది. సంతాన లేమి వంటి సమస్యలకు దారితీస్తుంది. తక్కువ స్పెర్మ్, స్పెర్మ్ నాణ్యత లేకపోవడం వంటి సమస్యలు పురుషుల్లో అధికమవుతోంది. ఈ కారణంగా వారి వ్యక్తిగత జీవితం ఒడిదుడుకులకు లోనవుతుంది. అయితే, ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మంచి జీవనశైలిని అనుసరించడం, మంచి ఆహారం తీసుకోవడంతో పాటు.. 5 వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం వల్ల పురుషుల లైంగిక సామర్థ్యం మెరుగవుతుందని చెబుతున్నారు. మరి ఆ వ్యాయామాలు ఏంటి? ఆహారం ఏంటి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లైంగిక ఆరోగ్యం మెరుగు పరుచుకునేందుకు చేయాల్సిన వ్యాయామాలు..

1. పద్మాసనం(Lotus pose)

2. రివర్స్ ప్లాంక్ వ్యాయామం

ఇవి కూడా చదవండి

3. స్క్వాట్స్ వ్యాయామం

4. ఓవర్ హెడ్ స్క్వాట్ వ్యాయామం

5. ఫ్రంట్ ప్లాంక్ వ్యాయామం.

తినే ఆహారం విషయంలోనూ జాగ్రత్త..

వ్యాయామంతో పాటు ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ప్రతిరోజూ అరటిపండు తినాలి. ఇందులో ఉండే పొటాషియం, B6 సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. అంతేకాకుండా.. సీజనల్ ఫ్రూట్ అయిన పుచ్చకాయ కూడా తినొచ్చు. దానిమ్మ పండ్లు కూడా లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..