Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women Health: ప్రతి స్త్రీ తెలుసుకోవలసిన నాలుగు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు..

అసౌకర్యం, ఇబ్బంది, అవమాన భయం, అవగాహన లేమి, నిరక్షరాస్యత వంటి వివిధ కారణాల వల్ల మహిళలు తమ లైంగిక ఆరోగ్యం గురించి ఇతరుల చర్చించేందుకు వెనుకడుగు వేస్తారు. ఆ అంశం గురించే ప్రస్తావించేందుకు భయపడుతారు. వాస్తవానికి చాలా మంది స్త్రీలు లైంగిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నామని, సహాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో

Women Health: ప్రతి స్త్రీ తెలుసుకోవలసిన నాలుగు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు..
Women Health
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 10, 2023 | 8:57 PM

అసౌకర్యం, ఇబ్బంది, అవమాన భయం, అవగాహన లేమి, నిరక్షరాస్యత వంటి వివిధ కారణాల వల్ల మహిళలు తమ లైంగిక ఆరోగ్యం గురించి ఇతరుల చర్చించేందుకు వెనుకడుగు వేస్తారు. ఆ అంశం గురించే ప్రస్తావించేందుకు భయపడుతారు. వాస్తవానికి చాలా మంది స్త్రీలు లైంగిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నామని, సహాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియక తమలో తాము నలిగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ‘లైంగిక ఆరోగ్య సమస్యలకు చికిత్స పొందుతున్నప్పుడు బాధిత మహిళలకు మద్దతుగా, ప్రశాంతంగా ఉండటానికి.. వారి సమస్యలను మనస్ఫూర్తిగా చెప్పడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి.’ వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. మహిళల్లో సైత మార్పు రావాలని కోరుతున్నారు. మహిళలు తమ లైంగిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఏ సమస్యనైనా ఉంటే వైద్య సహాయం తీసుకోవాలంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. ప్రతి స్త్రీ తనకు తానుగా తెలుసుకోవాల్సిన, అవగాహన పెంచుకోవాల్సిన నాలుగు అంశాలు ఉన్నాయని, వాటిని ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.

లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు(SIT)..

యోని, నోరు, అంగం ఒక వ్యక్తి నుండి మరొకరికి లైంగిక వ్యాధులు సంక్రమించే ప్రధాన మార్గాలు. స్త్రీల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనేక రకాల STIలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్లామిడియా : మూత్ర విసర్జన సమయంలో మంట, అసాధారణ యోని ఉత్సర్గ, పొత్తి కడుపులో నొప్పి మొదలైన లక్షణాలను కలిగించే బ్యాక్టీరియా సంక్రమణం.

ఇవి కూడా చదవండి

హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV): HPV అనేది వల్వా, యోని, గర్భాశయంతో సహా జననేంద్రియ ప్రాంతాన్ని ప్రభావితం చేసే వైరల్ ఇన్ఫెక్షన్. కొన్ని రకాల HPV జననేంద్రియ మొటిమలకు కారణమవుతుంది, మరికొన్ని గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తుంది.

కొన్ని పరిస్థితులలో సిఫిలిస్, ట్రైకోమోనాస్ (యోని, గర్భాశయం, మూత్రనాళాన్ని ప్రభావితం చేసే వైరస్ వ్యాప్తి) జననేంద్రియ హెర్పెస్, హెపటైటిస్, HIV/AIDS, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV), పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID) మొదలైనవి వ్యాప్తి చెందుతాయి.

STI లక్షణాలు పెద్దగా కనిపించవు. తేలికపాటి లక్షణాలతో అనారోగ్యానికి గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి. STIలు యోని స్రావాలు, పురుషాంగం నుండి ఉత్సర్గ, మూత్రనాళం నుండి ఉత్సర్గ, మూత్రం పోసేటప్పుడు మంట, పురుషులలో మూత్రనాళంలో మంట, జననేంద్రియ పూతలు, కడుపు నొప్పికి కారణమవుతాయి.

లైంగిక సామర్థ్యం తగ్గడం..

లైంగిక కార్యకలాపాల సమయంలో ఉద్రేకం, నొప్పి, ఉద్వేగం, కోరిక, ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు శారీరక లేదా మానసిక కారణాల వల్ల సంభవించవచ్చు. దీనిని వాజినిస్మస్ అని కూడా ఉంటారు. సంభోగం, టాంపోన్ చొప్పించడం లేదా గైనకాలజిస్ట్ కటి పరీక్షల సమయంలో సంభవించే యోని అసంకల్పిత బిగుతు. సెక్స్ సమయంలో ఆందోళన, భయం, లేదా సెక్స్‌కు సంబంధించిన ఇతర ప్రతికూల భావాలు, అలాగే లైంగిక వేధింపులు లేదా అత్యాచారం వంటి గత లైంగిక బాధలు, వాజినిస్మస్‌తో సంబంధం కలిగి ఉండే కొన్ని కారణాలు.

డైస్పరేనియా..

లైంగిక కలయిక సమయంలో నొప్పి గురించి తెలుసుకోవలసిన మరొక అంశం. లైంగిక అసౌకర్యాన్ని తగ్గించడానికి ల్యూబ్రికెంట్స్, ఇతర ఉత్పత్తులను ఉపయోగించడం, వ్యాయామాలు చేయడం ద్వారా డైస్పరేనియాకు చికిత్స చేయవచ్చు.

ప్రణాళిక లేని ప్రెగ్నెన్సీ, అబార్షన్..

ప్రణాళిక లేని గర్భం కారణంగా చాలా మంది మహిళలు ఒత్తిడి, మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రెగ్నెన్సీ వద్దనుకునే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సురక్షితమైన అబార్షన్ కోసం గైనకాలజిస్ట్‌ని సంప్రదించడం ఉత్తమం. అబార్షన్ చేసిన తర్వాత, స్త్రీ శారీరకంగా, మానసికంగా తనను తాను శక్తివంతంగా చేసుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండేందుకు డాక్టర్ సూచించిన మందులను సమయానికి, సరైన రోజులలో తీసుకోవాలి. అధిక రక్తస్రావం జరగకుండా చూసుకోవడం, ఒకవేళ అలా జరిగితే.. వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..