- Telugu News Photo Gallery LED vs CFL: Which bulb is wise to install which one reduces the electricity bill know details
LED vs CFL: ఎల్‌ఈడీ, సీఎఫ్ఎల్ బల్బులలో ఏది ఉత్తతమైనది? కరెంట్ బిల్లు ఏది తగ్గిస్తుంది? వివరాలివే..
ప్రజలు తమ ఇళ్లలో కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ (CFL) లేదా లైట్-ఎమిటింగ్ డయోడ్‌లు (LED) ఉపయోగించాలని చాలా మంది సూచిస్తుంటారు. అయితే, ఈ రెండు బల్బులలో ఏది మంచిది? ఏ బల్బును ఎంచుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 11, 2023 | 9:55 PM

ఫిలమెంట్ బల్బుల రోజులు దాదాపు ముగిశాయి. ప్రజలు ఇప్పుడు శక్తిని ఆదా చేసే లైటింగ్ ఆప్షన్స్ వైపు అడుగులు వేస్తున్నారు. చాలా మంది నిపుణులు.. ఇళ్లలో కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ (CFL) లేదా లైట్-ఎమిటింగ్ డయోడ్‌లు (LED) ఉపయోగించాలని సూచిస్తున్నారు. అయితే, ఈ రెండు బల్బులలో ఏది మంచిది? ఏ బల్బును ఎంచుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది?

CFLలు, LED లు ఎలా పని చేస్తాయో ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. CFLని ఆన్ చేసినప్పుడు, అతినీలలోహిత కాంతిని విడుదల చేసే రసాయనాలు (ఆర్గాన్, పాదరసం) కలిగిన ట్యూబ్ ద్వారా విద్యుత్ వెళుతుంది. అప్పుడు మానవ కంటికి కనిపించని ఈ అతినీలలోహిత కాంతి ట్యూబ్ లోపల ఉన్న ఫ్లోరోసెంట్ కోటింగ్ (ఫాస్ఫర్)ని తాకుతుంది.

కొంత సమయం తర్వాత ఈ ఉత్తేజిత పూత కనిపించే కాంతిని విడుదల చేస్తుంది. CFLలు ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటాయి. ఇవి వేడెక్కడానికి ఒకటి లేదా రెండు నిమిషాలు పడుతుంది. అయితే, ఇవి ఫిలమెంట్ బల్బుల కంటే 70 శాతం వరకు తక్కువ విద్యుత్‌ను ఉపయోగిస్తాయి.

LED బల్బుల విషయానికి వస్తే.. ఇది కొత్త లైటింగ్ టెక్నాలజీ. LED లను టీవీలు, డిజిటల్ వాచెస్, అనేక ఇతర ఉపకరణాలలో ఉపయోగిస్తారు. LEDని ఆన్ చేసినప్పుడు, డయోడ్ అని పిలువబడే సెమీకండక్టర్ పదార్థం ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని పంపడం జరుగుతంది. విద్యుత్ ప్రవాహంలోని ఎలక్ట్రాన్లు సెమీకండక్టర్ ద్వారా ప్రవహించినప్పుడు కాంతి ఉత్పత్తి అవుతుంది. సంప్రదాయ బల్బులతో పోలిస్తే ఇవి 90 శాతం వరకు విద్యుత్‌ను ఆదా చేస్తాయి.

విద్యుత్తును ఆదా చేసే విషయానికి వస్తే.. CFL, LED రెండూ సంప్రదాయ బల్బుల కంటే ఎక్కువ విద్యుత్‌ను ఆదా చేస్తాయి. కానీ, రెండింటిలో అత్యంత ప్రభావవంతమైనది LED. CFLలు దాదాపు 25% ఎక్కువ సమర్థవంతమైనవి, LED లు దాదాపు 75% ఎక్కువ సమర్థవంతమైనవి.

ఏది ఎక్కువ కాలం ఉంటుంది: LEDలు, CFLలు రెండూ ఎక్కువ కాలం ఉంటాయి. కానీ, ఇక్కడ కూడా LED లు ముందున్నాయి. అయితే సంప్రదాయ బల్బు జీవితకాలం 1000 గంటలు మాత్రమే. CFL 10,000 గంటల లైఫ్‌టైమ్ ఉంటుంది. LED దాదాపు 25,000 గంటల లైఫ్‌టైమ్‌ని కలిగి ఉంటుంది. మొత్తంమీద, LED లు CFLల కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. అలాగే, CFLల కంటే LED లు ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచివి.





























