Budget Smartphones: సూపర్ స్టోరేజ్‌తో వచ్చే హైస్పీడ్ ఫోన్లు ఇవే.. ఈ ఫోన్ల ఫీచర్లు చూస్తే మతిపోతుందంతే..!
ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తక్కువ ధరలో హైస్పీడ్ ఫోన్లంటే యువత ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. యువతను ఆకట్టుకునేందుకు కంపెనీలుకూడా సరసమైన ధరలకు అద్భుత స్పెసిఫికేషన్లతో ఫోన్లను అందిస్తుంది. ముఖ్యంగా ర్యామ్ కెపాసిటీని పెంచి ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నారు. ధర పాయింట్‌నే ప్రామాణికంగా తీసుకుని టాప్ కంపెనీలు అందిస్తున్నఅద్భుత ఫోన్లు ఏంటో ఓ సారి చూద్దాం. 2023లో 6 జీబీ ర్యామ్‌తో వచ్చే ఐదు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం.
Srinu |
Updated on: Jun 12, 2023 | 10:00 AM

మోటోరోలా జీ 72 ఈ ఫోన్ 6జీబీతో వచ్చే గొప్ప బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. 108 ఎంపీ కెమెరాతో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో కూడిన స్టీరియో స్పీకర్లు నాణ్యమైన ఆడియో, మెరుగైన వీక్షణ అనుభవాలను అందిస్తాయి. మీడియా టెక్ హీలియో ప్రాసెసర్‌తో పాటు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన ప్రత్యేకతలు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 34 5జీ ఈ ఫోన్ సామ్‌సంగ్ ఎస్ 23కు సమానమైన లక్షణాలను కలిగి ఉంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో మీడియా టెక డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ బ్యాటరీ, 48 ఎంపీ + 8 ఎంపీ+ 5 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.

పోకో ఎక్స్ 5 ప్రో 5 జీ 6 జీబీతో వచ్చే ఉత్తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా డాల్బీ విజన్ సపోర్ట్‌తో దాని 6.67 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్‌తో పాటు 108 ఎంపీ+ 8 ఎంపీ +2 ఎంపీ ట్రిపుల కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ముఖ్యంగా ఈ ఫోన్ ఐపీ 53 రేటింగ్‌తో వస్తుంది.

వన్ ప్లస్ నార్డ్ సీఈ2 ఇది 6 జీబీ ర్యామ్‌తో వచ్చే అత్యుత్తమ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో, 6.59 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 64 ఎంపీ + 2 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఈ ఫోన ప్రత్యేకతలు. అలాగే ఈ ఫోన్ 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతును ఇస్తుంది. ముఖ్యంగా వన్‌ప్లస్ బ్రాండ్ లవర్స్‌కు బడ్జెట్‌లో అందుబాటులో ఉండే సూపర్ స్మార్ట్ ఫోన్ నిపుణులు చెబుతున్నారు.

రియల్ మీ 10 ప్రో 5జీ 6జీబీ ర్యామ్‌తో వచ్చే టాప్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇదే. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో, మీడియాటెక్ డైమెన్సిటీ ద్వారా చాలా సూపర్ స్పీడ్‌గా ఈ ఫోన్ పని చేస్తుంది. 108 ఎంపీ ప్రైమరీతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ముఖ్యంగా ఫొటో లవర్స్‌కు ఈ ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. అలాగే 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మద్దుతుతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌ను ఆకర్షణీయంగా చేస్తుంది.





























