- Telugu News Photo Gallery Business photos World Richest Companies: meta to tesla Top Companies in the world by market cap
World Richest Companies: ఇవి ప్రపంచంలోని టాప్ 10 రిచ్చెస్ట్ కంపెనీలు.. ఇందులో మనం ఎక్కడా..
మే 2023 నాటికి 2.75 ట్రిలియన్ US డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో, Apple ఆ సంవత్సరం ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా నిలిచింది. ప్రపంచంలోని అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్‌లలో కొన్ని మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. అందులో.. మైక్రోసాఫ్ట్, సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ (సౌదీ అరామ్‌కో), గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, అమెజాన్. సౌదీ అరామ్‌కో 2022లో ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన కంపెనీల ర్యాంకింగ్‌లో అగ్రగామిగా ఉంది.
Updated on: Jun 12, 2023 | 7:20 AM

ప్రపంచంలోని టాప్ 25 కంపెనీల జాబితా బయటకు వెలువడింది. ఇందులో చాలా అమెరికన్ కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ జాబితాలో భారత కంపెనీల పేరు కనిపించలేదు.

టాప్ టెన్ కంపెనీల జాబితాలో ఎనిమిది కంపెనీలు అమెరికా నుంచి మాత్రమే ఉన్నాయి. ఇందులో ఆపిల్ నుండి మెటా వరకు పేర్లు ఉన్నాయి. అలాగే, సౌదీ అరేబియా, తైవాన్ కంపెనీ ఉంది.

ప్రపంచంలోని అత్యంత సంపన్న కంపెనీ గురించి మాట్లాడితే.. ఈ స్థానంలో ఐఫోన్ తయారీదారు కంపెనీ ఆపిల్ ఉంది. దీని మొత్తం మార్కెట్ క్యాప్ $ 2.8 ట్రిలియన్. మార్కెట్‌ను పెంచుకోవడానికి.. ఇటీవల ముంబై, ఢిల్లీలో దాని రెండు స్టోర్లను ప్రారంభించింది.

2.4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్ రెండవ ధనిక కంపెనీ. దీని యజమాని బిల్ గేట్స్, అతను ప్రపంచంలోని ఆరవ ధనవంతుడు. ఇది కూడా అమెరికా కంపెనీయే.

మూడవ స్థానంలో సౌదీ అరేబియా కంపెనీ సౌదీ అరాంకో ఉంది. దీని మార్కెట్ క్యాప్ $ 2 ట్రిలియన్. ఇది ఆయిల్ రిఫైనరీ కంపెనీ.

దీని తర్వాత స్థానంలో Google మాతృ సంస్థ ఆల్ఫాబెట్ $1.55 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో నాల్గవ స్థానంలో $1.24 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో అమెజాన్ ఐదవ స్థానంలో ఉంది.

వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి వచ్చిన డేటా ప్రకారం.. NVIDIA మార్కెట్ క్యాప్ $ 925 బిలియన్లు ఆరవ స్థానంలో ఉంది. ఏడవ ధనిక కంపెనీ అయిన బెర్క్‌షైర్ $ 734 బిలియన్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. ఎలోన్ మస్క్ టెస్లా $711 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో ఎనిమిదో స్థానంలో ఉంది. దీని తర్వాత మెటా, TSMC కంపెనీ ఉంది.





























