AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Must Watch: పిజ్జా డెలివరీకి వచ్చిన అమ్మాయి.. డోర్ ఓపెన్ చేయగా షాక్.. భయంతో వణికిపోయింది..!

Viral Video: సాధారణంగా ఏదైనా ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టినప్పుడు.. డెలివరీ బాయ్ ఆ వస్తువును డెలివరీ ఇచ్చేందుకు వస్తే మీరేం చేస్తారు? దాదాపు అందరూ తామే స్వయంగా వెళ్లి ఆ డెలివిరీని రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ ఇంట్లో ఆ సమయానికి అందుబాటులో లేకపోతే.. వేరొకరితో తీసుకుంటారు.

Must Watch: పిజ్జా డెలివరీకి వచ్చిన అమ్మాయి.. డోర్ ఓపెన్ చేయగా షాక్.. భయంతో వణికిపోయింది..!
Food Delivery
Shiva Prajapati
|

Updated on: Jun 12, 2023 | 1:51 PM

Share

Viral Video: సాధారణంగా ఏదైనా ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టినప్పుడు.. డెలివరీ బాయ్ ఆ వస్తువును డెలివరీ ఇచ్చేందుకు వస్తే మీరేం చేస్తారు? దాదాపు అందరూ తామే స్వయంగా వెళ్లి ఆ డెలివిరీని రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ ఇంట్లో ఆ సమయానికి అందుబాటులో లేకపోతే.. వేరొకరితో తీసుకుంటారు. మరి మనుషులు ఆర్డర్ చేసిన ఆహారాన్ని జంతువులు తీసుకోవడం, డబ్బులు కూడా చెల్లించడం ఎప్పుడైనా చూశారా? పోనీ కనీసం ఆ మ్యాటర్ గురించి విన్నారా? అయితే, ఇప్పుడు చూసేయండి మరి. సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో పని మనుషులను నియమించుకుంటారు. కొందరు మాత్రం రోబోట్‌లను వినియోగిస్తారు. మరి జంతువులను సైతం తమ సొంత పనులకు ఉపయోగించడం ఇప్పుడు చూడొచ్చు.

అవును, ఓ చింపాంజీ ఫుడ్ డెలివరీని రిసీవ్ చేసుకోవడమే కాకుండా.. డెలివరీ ఉమెన్‌కి డబ్బులు చెల్లించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియోలో ఓ అమ్మాయి పిజ్జా డెలివరీ చేసేందుకు వచ్చింది. ఇంటి కాలింగ్ బెల్ నొక్కగా.. డోర్ ఓపెన్ అయ్యింది. అయితే మనుషులు రావాల్సిన స్థానంలో ఓ చింపాంజి వచ్చింది. అది చూసి ఆమె జడుసుకుంది. భయంతో రెండుగులు వెనక్కి వేసింది. అయితే, ఆ చింపాంజి ప్యాంట్, షర్ట్ వేసుకుని సాదు జీవిలా ఉండటంతో కాస్త ధైర్యం తెచ్చుకుంది. చింపాంజి డబ్బులు ఇవ్వగా.. అవి తీసుకుని, పార్సిల్‌ కవర్‌ను చింపాంజికి ఇచ్చేసింది. ఆ వెంటనే తన బ్యాగ్ తీసుకుని పరుగు పరుగున వెళ్లిపోయింది యువతి.

ఇవి కూడా చదవండి

ఈ దృశ్యమంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవగా.. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియో చూసి నెటిజన్లు సైతం హడలిపోతున్నారు. ఇలా అయితే, ఎవరైనా భయపడతారని, ఇదెక్కడి షాక్ రా అయ్యా అని కాస్త నవ్వుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం.. వీడియోపై ఓ లుక్కేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..