Paytm – IRCTC: పేటీఎం యాప్ ద్వారా మీ ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అదెలాగంటే..!

ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్ పేటీఎం.. ప్రజలకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌(IRCTC) ఆటోమేటెడ్ వెండింగ్ మెషీన్ ద్వారా ప్రయాణికులు తమ ట్రైన్ టిక్కెట్‌ను సులభంగా, త్వరగా బుక్ చేసుకోవడానికి పేటీఎంతో చేతులు కలిపింది.

Paytm - IRCTC: పేటీఎం యాప్ ద్వారా మీ ట్రైన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అదెలాగంటే..!
Paytm Irctc
Follow us

|

Updated on: Jun 13, 2023 | 10:12 AM

ప్రముఖ ఆన్‌లైన్ పేమెంట్స్ యాప్ పేటీఎం.. ప్రజలకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌(IRCTC) ఆటోమేటెడ్ వెండింగ్ మెషీన్ ద్వారా ప్రయాణికులు తమ ట్రైన్ టిక్కెట్‌ను సులభంగా, త్వరగా బుక్ చేసుకోవడానికి పేటీఎంతో చేతులు కలిపింది. పేటీఎం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా గానీ, యూపీఐ ఆప్షన్ ద్వారా గానీ చెల్లించడం ద్వారా ప్రయాణికులు సులభంగా, త్వరగా టిక్కెట్‌లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇదిలాఉంటే.. పేటీఎం-ఐఆర్‌సీటీసీ మరో కొత్త సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు ప్రయాణించాలనుకుంటున్న రైలు ఎక్కడుంది? పీఎన్ఆర్ స్టేటస్ ట్రాక్ చేయడం వంటి ఆప్షన్‌ను కల్పిస్తుంది పేటీఎం.

ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్, iOS పేటీఎం వినియోగదారులకు అందుబాటులో ఉంది. రైలును ప్రత్యక్షంగా ట్రాక్ చేయడానికి, పీఎన్ఆర్ స్టేటస్‌ని చెక్ చేయడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

ఇవి కూడా చదవండి
  1. ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేసి.. ట్రైన్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  2. ఇప్పుడు పేటీఎం ట్రావెల్ విభాగం ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైలు, బస్సు, విమానాలు వంటి వివరాలను ట్రాక్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది.
  3. ఇందులో మీరు ట్రైన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ పిఎన్ఆర్ స్టేటస్, రైలు లైవ్ స్టేటస్, ట్రైన్ క్యాలెండర్, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే ఆప్షన్స్ కనిపిస్తాయి.
  4. ఇందులో రైలు నెంబర్ ఎంటర్ చేసి, సెర్చ్ బట్ క్లిక్ చేయాలి.
  5. సమాచారాన్ని నమోదు చేసిన తరువాత రాబోయే స్టాప్, చివరగా పాస్ అయిన స్టాప్, సమయం, ప్లాట్‌ఫారమ్ వివరాలు, ట్రైన్ ట్రావెలింగ్ టైమ్, మీరు ఉన్న స్టేషన్‌కు ట్రైన్ వచ్చే సమయం సహా అన్ని వివరాలను ఇక్కడ చూపిస్తుంది.
  6. అదే విధంగా టికెట్ బుకింగ్ స్టేటస్‌ను చెక్ చేయడానికి పీఎన్ఆర్ నంబర్‌ను ఎంటర్ చేసి చెక్ చేయొచ్చు.
  7. అలాగే ట్రైన్ టైమింగ్స్, షెడ్యూల్ వివరాలను కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు.

ATVM ల ద్వారా IRCTC  టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలి ?..

  1. మీ సమీప రైల్వే స్టేషన్‌ని సందర్శించాలి. అక్కడ ఉన్న ATVM వద్దకు వెళ్లాలి.
  2. ATVM లో మీరు ప్రయాణించాలనుకుంటున్న రూట్‌ను ఎంచుకోవాలి.
  3. ఆ తరువాత మీ చెల్లింపు ఆప్షన్ పేటీఎం యూపీఐని ఎంచుకోవాలి.
  4. స్క్రీన్‌పై అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.
  5. లావాదేవీ పూర్తయిన తరువాత ఏటీఎం నుంచి భౌతిక టిక్కెట్‌ వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..