Viral: తాగుబోతుల్లో ఆణిముత్యం.. మద్యం మత్తులో కారు, ఫోన్, ల్యాప్‌టాప్, డబ్బులు అన్నీ ఇచ్చేశాడు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

మద్యం మత్తులో తన కారును ఓ అపరిచిత వ్యక్తికి ఇచ్చి.. తాను మాత్రం మెట్రోలో ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత మత్తు దిగాక.. ‘నా కారు పోయింది’ అంటూ లబోదిబోమన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ దొంగ కారు దిగమని చెప్పగానే.. ఇతగాడు కారు దిగి ఎంచక్కా మెట్రో స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లాడు.

Viral: తాగుబోతుల్లో ఆణిముత్యం.. మద్యం మత్తులో కారు, ఫోన్, ల్యాప్‌టాప్, డబ్బులు అన్నీ ఇచ్చేశాడు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
Drunken Man
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 13, 2023 | 12:36 PM

మద్యం మత్తులో తన కారును ఓ అపరిచిత వ్యక్తికి ఇచ్చి.. తాను మాత్రం మెట్రోలో ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత మత్తు దిగాక.. ‘నా కారు పోయింది’ అంటూ లబోదిబోమన్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ దొంగ కారు దిగమని చెప్పగానే.. ఇతగాడు కారు దిగి ఎంచక్కా మెట్రో స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ విచిత్ర ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-2 ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రకాష్.. ఆదివారం నాడు మద్యం సేవించాలని నిర్ణయించుకున్నాడు. తన పని ముగిసిన తరువాత.. నేరుగా గురుగ్రామ్ వెళ్లాడు. అక్కడ ఓ వైన్ మార్ట్‌లో కొంత మద్యం సేవించాడు.

అయితే, ఇతను కారులో కూర్చుని మద్యం సేవించే సమయంలో ఓ అపరిచిత వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరం కలిసి తాగుదామా? అని అడగ్గానే ప్రకాష్ కంపెనీ కోసం సరే అని చెప్పాడు. ఇంకేముంది.. ఇద్దరూ కలిసి ఫుల్లుగా మద్యం సేవించారు. అయితే, మనోడికి మాత్రం మందు గట్టిగా ఎక్కింది. దాంతో కారు కూడా ఆ అపరిచిత వ్యక్తి డ్రైవ్ చేశాడు. ఇంతలో కారు సుభాష్ చౌక్‌కు చేరుకోగా.. ఆ కేటుగాడు ప్రకాష్‌ను కారు దిగమని కోరాడు. దాంతో మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక అతను కారు దిగాడు. ఇంకేముంది.. ఆ కేటుగా పక్కా ప్లాన్‌తో కారు తీసుకుని ఉడాయించాడు. ఇక మద్యం మత్తులో ఉన్న ప్రకాశ్.. నడచుకుంటూ మెట్రో స్టేషన్‌కు వెళ్లాడు. మెట్రోలో తన ఇంటికి చేరుకున్నాడు.

తెల్లారితే గానీ అసలు కథంతా గుర్తుకు వచ్చింది మనోడికి. నా కారు.. నా పర్సు.. నా డబ్బులు.. నా ల్యాప్‌టాప్.. అంటూ తెగ హడావిడి చేశాడు. ఒక్కసారిగా ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే అసలు కథ గుర్తుకువచ్చింది. వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశాడు ప్రకాశ్. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కారులో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, రూ. 18 వేల నగదు ఉన్నాయని, కారును దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రకాశ్. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?