Kishan Reddy: సాధారణ కార్యకర్త నుంచి కేంద్రమంత్రిగా.. కిషన్‌ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు

ఒక సాధారణ కార్యకర్తగా మొదలై దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ఏ పదవి చేపట్టినా వాటికి వన్నె తీసుకొచ్చారాయన. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజలకు సేవలందించిన కిషన్‌ రెడ్డి దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రతిభను చాటిచెప్పారు.

Kishan Reddy: సాధారణ కార్యకర్త నుంచి కేంద్రమంత్రిగా.. కిషన్‌ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు
Kishan Reddy, PM Modi
Follow us
Basha Shek

|

Updated on: Jun 15, 2023 | 7:54 PM

ఒక సాధారణ కార్యకర్తగా మొదలై దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ఏ పదవి చేపట్టినా వాటికి వన్నె తీసుకొచ్చారాయన. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా ప్రజలకు సేవలందించిన కిషన్‌ రెడ్డి దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రతిభను చాటిచెప్పారు. 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించారు కిషన్ రెడ్డి. టూల్‌ డిజైనింగ్‌లో డిప్లొమో చేసిన ఆయన రాజకీయాలపై ఆసక్తితో జనతా పార్టీలో చేరారు. 1977లో జనతా పార్టీలో యూత్‌ లీడర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు. మొదట రంగా రెడ్డి జిల్లా బీజేపీ యువ మోర్చా కన్వీనర్‌గా సేవలందించారు. 2004లో బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన అదే ఏడాది హిమాయత్ నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2009లో ఓడిపోయినా.. 2014లో అంబర్‌ పేట్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అదే ఏడాది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఆ మరుసటి ఏడాది సికింద్రాబాద్‌ ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈక్రమంలో బీజేపీకి కిషన్‌ రెడ్డి  అందించిన సేవలను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2019లో ఆయనకు హోం శాఖ సహాయమంత్రిగా స్థానం కల్పించారు. ప్రస్తుత క్యాబినేట్‌లో కూడా సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖా మంత్రిగా సేవలందిస్తున్నారాయన.

ఇలా సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి వరకు ఎదిగిన కిషన్‌ రెడ్డి ఇవాళ (జూన్‌ 15) పుట్టిన రోజు శుభాకాంక్షలు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌షాతో సహా పలువురు ప్రముఖులు కిషన్‌ రెడ్డికి బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. ‘ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేశంలో పర్యాటక రంగాన్ని మెరుగుపర్చడంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ దేవుడని ప్రార్థిస్తున్నాను’ అని మోడీ ట్వీట్‌ చేశారు. మోడీతో పాటు కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, జై శంకర్‌, నితిన్‌ గడ్కరీ, రాజ్‌ నాథ్‌ సింగ్‌, స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు కిషన్‌ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
మెడ నల్లగా మారిందా..? ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతుంది..!
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
కంటెంట్ ఉన్న క్లైమాక్స్ చాలు.. బొమ్మ హిట్టు.. అదే దారిలో ఆ మూవీ..
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
భూతాపం తగ్గించే వజ్రాయుధం అదే.. కానీ దాని ఖర్చెంతో తెలుసా?
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!