AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tushar Deshpande: క్లాస్‌మేట్‌ ఇక సోల్‌మేట్‌.. చిన్ననాటి ఫ్రెండ్‌తో ఉంగరాలు మార్చుకున్న చెన్నై స్టార్ బౌలర్‌

టీమిండియా క్రికెటర్లు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారు. కేఎల్‌ రాహుల్- సునీల్ శెట్టి, రుతురాజ్‌- ఉత్కర్ష, ప్రసిద్ధ్‌ కృష్ణ- రచన.. ఇలా ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అతను మరెవరో కాదు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్‌ బౌలర్ తుషార్ పాండే.

Tushar Deshpande: క్లాస్‌మేట్‌ ఇక సోల్‌మేట్‌.. చిన్ననాటి ఫ్రెండ్‌తో ఉంగరాలు మార్చుకున్న చెన్నై స్టార్ బౌలర్‌
Tushar Deshpande
Basha Shek
|

Updated on: Jun 13, 2023 | 12:41 PM

Share

టీమిండియా క్రికెటర్లు వరుసగా పెళ్లిపీటలెక్కుతున్నారు. కేఎల్‌ రాహుల్- సునీల్ శెట్టి, రుతురాజ్‌- ఉత్కర్ష, ప్రసిద్ధ్‌ కృష్ణ- రచన.. ఇలా ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అతను మరెవరో కాదు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్‌ బౌలర్ తుషార్ పాండే. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2023 సీజన్‌లో తుషార్‌ పాండే అద్భుతంగా రాణించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 26.86 సగటుతో 21 వికెట్లు పడగొట్టి చెన్నై తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. మొత్తమ్మీద ఐపీఎల్‌లో 23 మ్యాచ్‌లు ఆడిన తుషార్‌ 25 వికెట్లు తీసుకున్నాడు. తన సీమ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసిన ఈ చెన్నై బౌలర్‌ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబయిలో తుషార్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు నభాతో కలిసి ఉంగరాలు మార్చుకున్నాడీ స్టార్‌ బౌలర్‌. ఈ ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌కు టీమిండియా క్రికెటర్‌ శివమ్‌ దూబే తదితరులు హాజరయ్యారు.

కాగా తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను మీడియా వేదికగా పంచుకున్నాడు తుషార్‌ దేశ్‌ పాండే. తనకు కాబోయే సతీమణి ఫొటోలను షేర్‌ చేస్తూ ‘నా స్కూల్ క్రష్ నుండి నాకు కాబోయే భార్యగా ఆమె ప్రమోట్ అయ్యింది’ అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం తుషార్‌ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. టీమిండియా క్రికెటర్లు తుషార్‌కు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఇటీవలే పెళ్లిచేసుకున్న రుతురాజ్‌ అయితే ‘వెల్‌ కమ్‌ టూ క్లబ్‌’ అని కామెంట్‌ చేయగా, సూర్యకుమార్‌ యాదవ్ తదితరులు బెస్ట్‌ విషెస్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది