AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? టాలీవుడ్ స్టార్‌ హీరో సతీమణి.. ది మోస్ట్ హ్యూమన్ బీయింగ్

ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడామె టాలీవుడ్‌ స్టార్‌ హీరో సతీమణి. పుట్టిల్లు, అత్తిల్లు.. రెండూ బడా ఫ్యామిలీలే. అయితే ఈ ట్యాగ్‌ను పక్కన పెట్టి మరీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన సేవా కార్యక్రమాలతో తన మంచి మనసును చాటుకుంటోంది. ముఖ్యంగా మూగజీవాలపై ఆమెకు అమితమైన ప్రేమ..

Tollywood: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? టాలీవుడ్ స్టార్‌ హీరో సతీమణి.. ది మోస్ట్ హ్యూమన్ బీయింగ్
Tollywood Celebrity
Basha Shek
|

Updated on: Jun 13, 2023 | 8:47 AM

Share

ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడామె టాలీవుడ్‌ స్టార్‌ హీరో సతీమణి. పుట్టిల్లు, అత్తిల్లు.. రెండూ బడా ఫ్యామిలీలే. అయితే ఈ ట్యాగ్‌ను పక్కన పెట్టి మరీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన సేవా కార్యక్రమాలతో తన మంచి మనసును చాటుకుంటోంది. ముఖ్యంగా మూగజీవాలపై ఆమెకు అమితమైన ప్రేమ. వాటి సంరక్షణ కోసం పలు కార్యక్రమాలు, క్యాంపెయిన్లు చేపడుతోంది. వీటితో పాటు ప్రముఖ వ్యాపారవేత్త మనవరాలిగా బిజినెస్‌ పనులు చూసుకుంటూ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ వుమన్‌గా పేరు పొందింది. ఇప్పటికైనా గుర్తుపట్టారా? ఈ ఫొటోలో ఉన్నదెవరో? గుర్తుపట్టకపోయినా నో ప్రాబ్లమ్‌. ఆన్సర్‌ మేమే చెబుదాం లెండి. ఆమె మరెవరో కాదు మెగా కోడలు, మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ సతీమణి కొణిదెల ఉపాసన. ప్రముఖ వ్యాపారవేత్త అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలైన ఆమె చిన్న వయసునుంచే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అపోలో హెల్త్‌ ఫౌండేషన్‌ వైస్‌ ఛైర్‌ పర్సన్‌గా పలు సామాజిక ప్రాయోజిత కార్యక్రమాలు చేపట్టింది.అలాగే ‘ You Exchange’ అనే సేవా సంస్థను నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలను సేకరించి.. పేద పిల్లలకు అందించింది. అలాగే మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స అందించేలా కృషి చేసింది.

ఇక మెగా కోడలిగా చిరంజీవి ఇంట్లోకి అడుగపెట్టి అందరి ఆదరాభిమానాలు గెల్చుకుంది ఉపాసన. ముఖ్యంగా రామ్‌ చరణ్‌ సతీమణిగా అతని అడుగుజాడల్లో నడుస్తూ అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ఇక త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది ఉపాసన. ప్రస్తుతం ఏడు నెలల గర్భంతో ఉందామె. మెగా వారుసుడు/ వారసురాలి కోసం వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్
తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్
పీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.. ఎలానో చూడండి
పీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.. ఎలానో చూడండి
మహిళల కోసం స్పెషల్‌ బిజినెస్‌ ఐడియా..
మహిళల కోసం స్పెషల్‌ బిజినెస్‌ ఐడియా..
మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..
మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..
ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది..
ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది..
వెయిట్‌ లాస్‌ ప్లాన్‌లో కొబ్బరి మ్యాజిక్‌లా పని చేస్తుందని తెలుసా
వెయిట్‌ లాస్‌ ప్లాన్‌లో కొబ్బరి మ్యాజిక్‌లా పని చేస్తుందని తెలుసా
ఫ్రీ, ఫ్రీ,రాష్ట్రంలో మళ్లీ ఉచితాల జోరు!విద్యార్థులకు గుడ్‌న్యూస్
ఫ్రీ, ఫ్రీ,రాష్ట్రంలో మళ్లీ ఉచితాల జోరు!విద్యార్థులకు గుడ్‌న్యూస్
సిడ్నీలో కాటేరమ్మ కొడుకు బీభత్సం.. తుఫాన్ సెంచరీలో ఇచ్చిపడేశాడుగా
సిడ్నీలో కాటేరమ్మ కొడుకు బీభత్సం.. తుఫాన్ సెంచరీలో ఇచ్చిపడేశాడుగా
తెలంగాణ విద్యార్ధులకు ఎగిరిగంతేసే వార్త.. ఈసారి సంక్రాంతికి..
తెలంగాణ విద్యార్ధులకు ఎగిరిగంతేసే వార్త.. ఈసారి సంక్రాంతికి..
స్పామ్ కాల్స్‌కు చెక్.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్
స్పామ్ కాల్స్‌కు చెక్.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్