AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashmir Tour Package: ఐఆర్‌సీటీసీ ప్రత్యేక కాశ్మీర్ టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు

కాశ్మీర్‌ను సందర్శించడం కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఇది మీ ప్రయాణ సంబంధిత సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణ ఛార్జీల నుంచి హోటళ్ల ఛార్జీల వరకు అన్నీ కలిపి ఈ..

Kashmir Tour Package: ఐఆర్‌సీటీసీ ప్రత్యేక కాశ్మీర్ టూర్‌ ప్యాకేజీ.. పూర్తి వివరాలు
Kashmir Tour Package
Subhash Goud
|

Updated on: Jun 15, 2023 | 5:14 PM

Share

కాశ్మీర్‌ను సందర్శించడం కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఇది మీ ప్రయాణ సంబంధిత సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణ ఛార్జీల నుంచి హోటళ్ల ఛార్జీల వరకు అన్నీ కలిపి ఈ మొత్తంలోనే ఉంటాయి. ఐఆర్‌సీటీసీ వివరాల ప్రకారం.. ఈ కాశ్మీర్ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 20, 2023 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో శ్రీనగర్, గుల్మార్గ్, సోన్‌మార్గ్, పహెల్‌గావ్‌లకు ప్రయాణంతో పాటు వసతి కూడా ఉంటుంది. ఈ పర్యటన మొత్తం 6 రోజుల పాటు 5 రాత్రులు ఉంటాయి. ఇందులో విమాన, హోటల్ ఖర్చులు కలిపి ఉంటాయి.

ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలో మీ 5 రాత్రులు 3 రోజుల హోటల్ బస, విమాన ఖర్చులు ఉంటాయి. ఈ టూర్‌ ప్యాకేజీలో ఎక్కువ మంది వ్యక్తులు, పర్యటన చౌకగా ఉంటుంది. ఒకరి కోసం టూర్ బుక్ చేసుకుంటే రూ.40,450 అవుతుంది. అదే ఇద్దరు వ్యక్తుల కోసం అయితే ఒక్కొక్కరికి రూ.36,310, అలాగే ముగ్గురు బుకింగ్‌ అయితే ఒక్కొక్కరికి రూ. 35,110 ఖర్చవుతుంది.

మీరు కుటుంబ సమేతంగా ప్రయాణిస్తున్నట్లయితే 5 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ప్రత్యేక బెడ్‌తో ఉన్న వ్యక్తికి రూ.27,700 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మంచం లేకుండా ప్రయాణించినందుకు ఒక్కొక్కరికి రూ.25,340 ఛార్జ్ చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ IRCTC కాశ్మీర్ టూర్ ప్యాకేజీని ఫాసినేటింగ్ కాశ్మీర్ (EPA014) అంటారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ప్రధానంగా పాట్నాలో నివసిస్తున్న ప్రజలు వినియోగించుకోవచ్చు. అంటే సెప్టెంబరు 20న పాట్నా నుంచి విమానం అందుబాటులోకి వచ్చి అదే రోజు శ్రీనగర్ చేరుకుంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి