- Telugu News Photo Gallery World photos Floating city where 40000 people will live all you need to about japanese designers
Floating City: సముద్రం అలల మీద తెలియాడే నగరం.. ఆధునిక సౌకర్యాలతో సహా సునామీని తట్టుకునే సామర్ధ్యం..
అణు బాంబు దాడికి గురైనా తనని తాను మలచుకుంటూ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకుని ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా నిలిచింది జపాన్. ముఖ్యంగా రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులను సృష్టిస్తూ తన పేరుని చరిత్రలో సుస్థిరం చేసుకుంది జపాన్. తాజాగా జపాన్ దేశం మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది.
Updated on: Jun 15, 2023 | 6:59 PM

జపాన్‌లో సముద్రపు అలలపై నగరాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచంలో సముద్రం అలపై తేలి ఆడే మొట్ట మొదటి నగరంగా నిలవనుంది. వాస్తవానికి సముద్రం ఒడ్డున ఉన్న నగరంలో క్రీడాకారుల కోసం స్టేడియాలు ఉంటాయి. ఆడుకోవడానికి, నడవడానికి పార్కులు ఉంటాయి. బస చేసేందుకు రెసిడెన్షియల్ హోటళ్లు కూడా ఉంటాయి. అయితే జపాన్ దేశం ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు ఏకంగా ఒక నగరాన్ని సృష్టిస్తోంది. ఈ తేలియాడే నగరానికి డోగెన్ సిటీ అని పేరు పెట్టారు. ఈ తేలియాడే నగరంలో 40 వేల మంది హాయిగా జీవించవచ్చని దీన్ని సిద్ధం చేసిన ఎన్-ఆర్క్ డెవలపర్లు చెప్పారు. (ఫోటో కర్టసీ:N-Ark/DailyMail)

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. ఈ నగరం మూడు భాగాలుగా నిర్మించబడుతుంది. అన్నింటిలో మొదటిది, బయటి భాగం అంటే బయటి రింగ్.. ఈ ప్రాంతం నివసించేందుకు వీలుగా ఉంటుంది. నీరు, శక్తి , మురుగునీటి సౌకర్యాలు ఉంటాయి. రెండవ భాగం లోపలి రింగ్ అవుతుంది. ఇందులో తేలియాడే ఇళ్లు, భవనాలు ఉంటాయి. ఈ నగరంలోని ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి పడవ, ఫెర్రీని ఉపయోగించాల్సి ఉంటుంది. (ఫోటో కర్టసీ:N-Ark/DailyMail)

నగరంలో మూడో భాగం భూగర్భంలో ఉంటుంది. అంటే నగర నిర్మాణం నీటి ఉపరితలం కింద కూడా జరుగుతుంది. ఇక్కడ డేటా సెంటర్లు, మెడికల్ రీసెర్చ్ సదుపాయాలు ఉంటాయి. నగరం వెలుపలి భాగం సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎదుర్కొనే విధంగా రూపొందించబడింది. స్పోర్ట్స్ స్టేడియాలు, ఫ్లోటింగ్ పార్కులు, శ్మశాన వాటికలు, దేవాలయాలు, రెసిడెన్షియల్ హోటళ్లు కూడా ఉంటాయి. (ఫోటో కర్టసీ:N-Ark/DailyMail)

ఈ నగరాన్ని మెడికల్ సిటీ ఆఫ్ ది సీ అని కూడా పిలుస్తారు. ఇది హెల్త్‌కేర్, మెడికల్ టూరిజాన్ని పరిచయం చేస్తుంది. సముద్రంలో సులభంగా పండించగలిగే పండ్లు, కూరగాయలు కూడా ఈ నగరంలో కనిపిస్తాయి. ఫ్లోటింగ్ సిటీ నిర్మాణం 2030 నాటికి పూర్తవుతుందని.. ఈ నగరాన్ని నిర్మిస్తున్న కంపెనీ చెబుతోంది. అయితే ఈ నగర నిర్మాణం కోసం ఎంత బడ్జెట్ కేటాయించారు.. ఎంత ఖర్చు చేస్తున్నారు అనే విషయాన్నీ ఎక్కడా ఈ కంపెనీ తెలియజేయలేదు. (ఫోటో కర్టసీ:N-Ark/DailyMail)

ఈ తేలియాడే నగరం సహాయంతో ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధనలు జరుగుతాయని డెవలపర్లు చెప్పారు. అంతేకాదు ఈ నగరం వేదికగా పరిశోధన రంగంలో అనేక కొత్త ప్రయోగాలు ఉంటాయి. సముద్రంపై తేలియాడే నగరం ప్రజలకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది నిర్మాణ సంస్థ. (ఫోటో కర్టసీ:N-Ark/DailyMail)





























