- Telugu News Photo Gallery World photos Australia MP Lidia Thorpe alleges assault in Parliament by David Van
MP Lidia Thorpe: ‘పార్లమెంటు మహిళలకు సేఫ్ కాదు.. లైంగిక వేధింపులకు గురయ్యానని మహిళ ఎంపీ ఆరోపణలు
లైంగిక వేధింపులు అనేవి సినీ నటులకు, క్రీడాకారులకు, ఉద్యోగిణిలకు, సామాన్యులకు మాత్రమే కాదు.. ప్రజల కోసం ప్రజల తో ఎన్నుకోబడిన రాజకీయ మహిళా నేతలకు కూడా తప్పవని తెలుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియన్ ఎంపీ లిడియా థోర్ప్ కన్జర్వేటివ్ ఎంపీ డేవిడ్ వాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. పార్లమెంటు లోపల తనపై లైంగిక దాడి జరిగిందని థోర్ప్ చెప్పారు.
Updated on: Jun 16, 2023 | 11:22 AM

ఆస్ట్రేలియా దేశ చట్టసభలో తనపై లైంగిక దాడి జరిగిందని ఆస్ట్రేలియా మహిళా ఎంపీ లిడియా థోర్ప్ ఆరోపించారు. ఈ పార్లమెంట్ భవనం మహిళలు పని చేయడానికి "సురక్షితమైన స్థలం కాదన్నారు

లిడియో థోర్ప్ కన్జర్వేటివ్ ఎంపీ డేవిడ్ వాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, చాలాసార్లు తనను మెట్లపై పట్టుకుని అనుచితంగా తాకారని మహిళా ఎంపీ ఆరోపించారు.

ఆస్ట్రేలియన్ పార్లమెంట్‌లో మహిళా ఎంపీ ఈ విషయాలు వెల్లడించిన సమయంలో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. మరోవైపు కన్జర్వేటివ్ ఎంపీ డేవిడ్ వాన్ తనపై మహిళా ఎంపీ చేస్తున్న ఆరోపణలను పూర్తిగా అవాస్తవాలంటూ తోసిపుచ్చారు.

లైంగిక వేధింపులకు అర్థం అందరికీ ఒకేలా ఉండవని ఆస్ట్రేలియా ఎంపీ లిడియో థోర్ప్ చెప్పారు. డేవిడ్ వ్యాన్ తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించేవారని అభ్యంతరకరంగా తాకేవారంటూ ఏడుస్తూ వెల్లడించింది. తాను డేవిడ్ ఉన్న సమయంలో ఆఫీస్ నుంచి బయటకు రావాలంటే భయపడే స్టేజ్ కు చేరుకున్నానని.. ఆయన లేరని తాను నిర్ధారించుకునేదానిని చెప్పారు. బయటికి వెళ్లేముందు ఎవరైనా నిలబడి ఉన్నారా అని తనిఖీ చేసి ఎవరూ బయట లేరని నిర్ధారించుకున్న తర్వాతే వచ్చేదాన్ని ఆమె చెప్పారు.

పార్లమెంట్కి వచ్చే సమయంలో ఇక్కడ నడుస్తున్న సమయంలో తనకు తోడుగా ఎవరో ఒకరు ఉండేలా చూసుకునేదాన్ని.. తనలాగే ఇంకొందరు కూడా లైంగిక వేధింపులు అనుభవిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లిడియా థోర్ప్

లిడియా థోర్ప్ ఆస్ట్రేలియాలో స్వతంత్ర ఎంపీ. 2020 నుంచి విక్టోరియా నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు ఆమె ఆస్ట్రేలియన్ గ్రీన్ పార్టీలో సభ్యురాలిగా ఉన్నారు. అయితే 2023లో ఆమె పార్టీని విడిచిపెట్టారు

ఆస్ట్రేలియాలో లిడియో థోర్ప్ స్థానికుల స్వరాన్ని పార్లమెంట్ వేదికగా వినిపించే నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఆమె ఎల్లప్పుడూ స్థానికుల కోసం ఏదొక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
