Pakistan: ఆ గ్రామంలో సొంత రాజ్యాంగం.. వరకట్నం, స్టూడెంట్స్‌కు స్మార్ట్ ఫోన్‌పై నిషేధం.. పెళ్లి ఖర్చు అదుపు చేసే నియమాలు

పాకిస్థాన్ దేశంలోని ఒక గ్రామం సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుంది. నియమనిబంధనలు రూపొందించుకుని ప్రస్తుతం వార్తల్లో నిలిచింది ఆ గ్రామం. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలోని ఓ గ్రామం ప్రత్యేక రాజ్యాంగం, నిబంధనలు రూపొందించుకుని చర్చనీయాంశంగా మారిపోయింది. బనీర్ జిల్లా బునర్ ప్రాంతంలో ఉన్న ఆ ఊరి పేరు అన్సార్ మీరా. చాలా చిన్న గ్రామం.

Pakistan: ఆ గ్రామంలో సొంత రాజ్యాంగం.. వరకట్నం, స్టూడెంట్స్‌కు స్మార్ట్ ఫోన్‌పై నిషేధం.. పెళ్లి ఖర్చు అదుపు చేసే నియమాలు
Pakishtan Village
Follow us
Surya Kala

|

Updated on: Jun 16, 2023 | 1:06 PM

ప్రతి దేశానికి దాని సొంత రాజ్యాంగం ఉంటుంది.  దేశాన్ని పాలించేందుకు అన్ని నియమాలు, నిబంధనలు రాజ్యాంగంలో రూపొందించబడతాయి. వాటిని అనుసరిస్తూ పాలకులు తమ దేశాన్ని పాలిస్తారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఏదైనా ఒక గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు లేదా సర్పంచ్ ఆ గ్రామంలోని నియమాలు, నిబంధనలను ఏర్పరుస్తూ చట్టం చేసిన ఘటనలు గురించి ఎప్పుడైనా విన్నారా..! రాజ్యాంగం ప్రకారం ఏదైనా చట్టాన్ని పార్లమెంటులో రూపొందిస్తారు.. అది చట్టంగా అమలు కావడానికి  రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. అయితే పాకిస్థాన్ దేశంలోని ఒక గ్రామం సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుంది. నియమనిబంధనలు రూపొందించుకుని ప్రస్తుతం వార్తల్లో నిలిచింది ఆ గ్రామం. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలోని ఓ గ్రామం ప్రత్యేక రాజ్యాంగం, నిబంధనలు రూపొందించుకుని చర్చనీయాంశంగా మారిపోయింది.

ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బనీర్ జిల్లా బునర్ ప్రాంతంలో ఉన్న ఆ ఊరి పేరు అన్సార్ మీరా. చాలా చిన్న గ్రామం.  ఇక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడి అందరి అభిప్రాయాలను స్వీకరించి 20 సూత్రాల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు.  ఇందులో వరకట్న వేధింపులు, ఏరియల్ ఫైరింగ్, విద్యార్థుల స్మార్ట్ ఫోన్ల వాడకం వంటి వాటిపై నిషేధం విధించారు. అంతేకాదు వరకట్నంపై పూర్తిగా నిషేధం విధించారు. పెళ్ళికి అయ్యే ఖర్చును అదుపులో ఉంచడం కూడా రాజ్యాంగంలోని ఒక నియమం. మరణానికి సంబంధించిన విషయాలపై కూడా కొన్ని నియమాలు రూపొందించబడ్డాయి. తాము రాసుకున్న రాజ్యాంగంపై గ్రామస్తులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గౌరవం ఇస్తున్నారు. ఈ రాజ్యాంగంతో  గ్రామస్తుల పరిస్థితి మెరుగుపడుతుందని అంటున్నారు.

రాజ్యాంగాన్ని రూపొందించిన గ్రామంలోని పెద్దలు, పండితులు  గ్రామంలోని రాజ్యాంగం విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించడంపై నిషేదాన్ని విధించింది. అంతేకాదు  షరియా, స్థానిక సంప్రదాయాలకు భిన్నమైన ఆచారాలపై కూడా రాజ్యాంగం ప్రవేశపెట్టారు. ఇందులో మరో ముఖ్యమైన నిబంధన ప్రకారం.. ఈ గ్రామంలోని మహిళలకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పాకిస్తానీ మీడియా కథనం ప్రకారం గ్రామంలోని పెద్దలు , పండితులు గ్రామానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని రచించారు. ఆడపిల్లల పెళ్ళికి తండ్రి డబుల్ కాట్ బెడ్, టీవీ, ఫ్రిజ్ వంటి కొన్ని వస్తువులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నుంచి ఎవరైనా తమ ఇంటి ఆడపిల్లకు పెళ్లి సమయంలో ఏదైనా ఇవ్వాలనుకుంటే శక్తికి మించిన వస్తువులు ఇవ్వాల్సిన అవసరం లేదు.. తమ శక్తి మేర నగదు రూపంలో కూడా ఇవ్వవచ్చు.

  1. గ్రామ రాజ్యాంగంలోని కొత్త నిబంధనలు  ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇక నుంచి పెళ్లి కానుకగా గరిష్టంగా 100 రూపాయలు మాత్రమే ఇస్తారు.
  2. పెళ్లి తర్వాత బియ్యం పంపిణీ చేసే ఆచారాన్ని నిలిపివేయాలని నిర్ణయించారు. వీటన్నింటి వల్ల పెళ్లిలో చాలా డబ్బు వృధా అవుతుంది. డబ్బు వృథా కాకుండా కుటుంబాలపై భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నట్లు చెప్పారు.
  3. వివాహం సందర్భంగా ఎక్కువగా ఆహారానికి, ముందుకు ఖర్చు అవుతుంది.  ఆడపిల్ల పెళ్లి అయినా, మగ పిల్లాడు పెళ్లి అయినా భోజనాల కోసం లక్షల ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ఖర్చుకు చెక్ పెడుతూ.. ఈ గ్రామంలోని కొత్త రాజ్యాంగం ప్రకారం అతిథులకు టీ, బిస్కెట్లతో మాత్రమే స్వాగతం చెబుతారు.
  4. వివాహాల సమయంలో కళ్యాణోత్సవంలో భారీ సంఖ్యలో అతిధులను తీసుకెళ్లడం ఆచారం. ఇలా చేయడం వలనా ఇరువర్గాల వారిపై భారం పడుతోంది. ఖర్చు కూడా ఎక్కువే.  ఇక నుంచి 15 మంది కంటే ఎక్కువ మంది ఊరేగింపుకు వెళ్లడంపై నిషేధం అమల్లోకి వచ్చింది.
  5. కొత్త రాజ్యాంగం ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మోటార్ సైకిల్ నడపడానికి అనుమతిలేదు. అంతేకాదు విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు వినియోగంపై నిషేధం విధించారు. అపరిచితులు ఎవరూ గ్రామంలోకి ప్రవేశించలేరు. డ్రగ్స్ వ్యాపారం చేసే వారిపై పూర్తి సాంఘిక బహిష్కరణ అమలోకి తీస్కుని వచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..