Patanjali: పామాయిల్ ఉత్పత్తిలో పతంజలి.. 5 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుందన్న బాబా రాందేవ్

బాబా రామ్‌దేవ్‌ ఇస్తున్న  ఆఫర్ ను నమ్మి ఇప్పటి వరకు పామాయిల్ సాగు చేస్తున్న 40 వేల మంది రైతులు పతంజలిలో చేరారు. రానున్న కాలంలో వీరి సంఖ్యను 5 లక్షలకు పెంచాల్సి ఉందని వెల్లడించారు. దీంతో పతంజలిలో పామాయిల్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత 5 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది.

Patanjali: పామాయిల్ ఉత్పత్తిలో పతంజలి.. 5 లక్షల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతుందన్న బాబా రాందేవ్
Palm Oil
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2023 | 3:42 PM

పతంజలి కంపెనీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనేక రకాల ఉత్పత్తులతో మార్కెట్ తనకంటూ ఓ పేరుని సంపాదించుకుంది. అయితే పతంజలి కంపెనీ ఇప్పుడు పామాయిల్‌ను స్వయంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ విషయాన్ని బాబా రామ్‌దేవ్ స్వయంగా ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  పతంజలి ఇప్పుడు పామాయిల్‌ను స్వయంగా ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. పామాయిల్ ను  సాగు చేస్తున్న రైతులను పతంజలికి అనుసంధానం చేయనున్నామని తెలిపారు. బాబా రామ్‌దేవ్‌ ఇస్తున్న  ఆఫర్ ను నమ్మి ఇప్పటి వరకు పామాయిల్ సాగు చేస్తున్న 40 వేల మంది రైతులు పతంజలిలో చేరారు. రానున్న కాలంలో వీరి సంఖ్యను 5 లక్షలకు పెంచాల్సి ఉందని వెల్లడించారు. దీంతో పతంజలిలో పామాయిల్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత 5 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది.

ప్రత్యేక రకం పామాయిల్‌ను రైతులు పండిస్తారని బాబా రామ్‌దేవ్ తెలిపారు. దీంతో గతంలో కంటే ఎక్కువ పామాయిల్‌ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. ఈ కొత్త రకం పామాయిల్ చెట్ల వయస్సు కూడా గతం కంటే ఎక్కువని తెలిపారు. ఈ కొత్త రకం పామాయిల్‌ చెట్ల పెంపకాన్ని ప్రారంభించిన తర్వాత..ఈ చెట్ల నుంచి దాదాపు 40 సంవత్సరాల వరకు పంట దిగుబడి లభిస్తుంది.

గతంలో హెక్టారుకు 16 నుంచి 18 టన్నుల పామాయిల్ ఉత్పత్తి జరిగేదని.. ఇప్పుడు కొత్త రకం సాగు చేయడం ద్వారా 20 నుంచి 25 టన్నుల దిగుబడి వస్తుందని బాబా రామ్‌దేవ్ చెప్పారు. రైతు సోదరులు ఒక హెక్టారులో పామాయిల్ సాగు చేస్తే.. ఐదేళ్లలోపామాయిల్ చెట్లు దిగుబడి ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఒక హెక్టర్ కు దాదాపు రూ.2 లక్షల ఆదాయం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

రూ.2 లక్షల కోట్లు ఆదా.. 

అసోం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లో రైతులు పతంజలిలో చేరి పామాయిల్ సాగు చేస్తున్నారని బాబా రామ్ దేవ్ తెలిపారు. పతంజలి నర్సరీలో కోటి ఆయిల్ పామ్ మొక్కలను సిద్ధం చేసినట్లు బాబా రామ్‌దేవ్ తెలిపారు. రానున్న 5 నుంచి 6 ఏళ్లలో వీటి సంఖ్యను 8 నుంచి 10 మిలియన్లకు పెంచాల్సి ఉంది. పతంజలి ద్వారా పామాయిల్ ఉత్పత్తి ప్రారంభించడం వల్ల దేశానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. డబ్బులు వెచ్చించి విదేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని.. అప్పుడు భారతదేశానికి రూ.2 లక్షల కోట్లు ఆదా అవుతుందని పేర్కొన్నారు.

మన దేశంలో ఏడాదికి 9 మిలియన్ టన్నుల పామాయిల్ వినియోగం.. 

భారతదేశంలో పామాయిల్ వినియోగం చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో పామాయిల్ ని వినియోగంలో మన దేశంలో రెండో ప్లేస్ లో ఉంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 9 మిలియన్ టన్నుల పామాయిల్ వినియోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. మన దేశంలో వంట నూనెల వినియోగంలో పామాయిల్ వాటా దాదాపు 40 శాతం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..