AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Milk Production: పాల ఉత్పత్తి పెరగడానికి వేసవిలో ఈ గడ్డిని అందించండి.. రిజల్ట్ పక్కా..

వేసవి కాలంలో జంతువులు నీరసంగా ఉంటాయి. అంతేకాదు పశుగ్రాసం తీసుకోవడం కూడా తగ్గతుంది. దీని కారణంగా పాలు ఇచ్చే సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు పశువులకు ప్రత్యేకమైన పచ్చి గడ్డిని ఆహారంగా అందిస్తే.. పశువులు మునుపటిలా పాలు ఇస్తూనే ఉంటాయి.

Milk Production: పాల ఉత్పత్తి పెరగడానికి వేసవిలో ఈ గడ్డిని అందించండి.. రిజల్ట్ పక్కా..
Milk Production
Surya Kala
|

Updated on: Jun 10, 2023 | 10:52 AM

Share

వేసవి కాలం.. ఎండ వేడి.. వడగాల్పులు తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. ఉదయం 10 గంటలకే, ఎండ వేడితో మనుషులతో పాటు పశువులు కూడా అల్లాడిపోతున్నాయి. అధిక వేడి కారణంగా పశువులు కూడా తక్కువ పాలను ఉత్పత్తినిస్తాయి. ఎండ వేడి, వడగాల్పులతో పాల ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. అయితే ఇప్పుడు రైతులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైతు సోదరులు వేసవి కాలంలో కూడా మునుపటిలా పశువుల నుంచి అధిక పాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. దీని కోసం పశుగ్రాసంలో కొంత ప్రత్యేకమైన గడ్డిని కలుపుతూ జంతువులకు ఆహారాన్ని అందించాలి.

పశువైద్యుల అభిప్రాయం ప్రకారం.. వేసవి కాలంలో జంతువులు నీరసంగా ఉంటాయి. అంతేకాదు పశుగ్రాసం తీసుకోవడం కూడా తగ్గతుంది. దీని కారణంగా పాలు ఇచ్చే సామర్థ్యం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు పశువులకు ప్రత్యేకమైన పచ్చి గడ్డిని ఆహారంగా అందిస్తే.. పశువులు మునుపటిలా పాలు ఇస్తూనే ఉంటాయి. మంచి పశుగ్రాసంతో పాటు ఆవు, గేదెలను ఎప్పుడూ నీడలో కట్టి ఉదయం, సాయంత్రం నీళ్లతో స్నానం చేయించాలి. దీని వల్ల వేసవి కాలంలో పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో పశువులకు తినిపించే ప్రధానమైన మూడు గడ్డి గురించి ఈరోజు తెలుసుకుందాం..

నేపియర్ గడ్డి: నేపియర్ గడ్డి ప్రధానంగా థాయిలాండ్ నుండి వచ్చిన గడ్డి. అయితే ఇప్పుడు ఈ గడ్డి  భారతదేశంలోని రైతులు కూడా పెంచుతున్నారు. ఈ గడ్డి సరిగ్గా చెరకు లాగా ఉంటుంది. భారతదేశంలోని ప్రజలకు ఇది ఏనుగు గడ్డి పేరుతో తెలుసు. ఈ గడ్డిని బంజరు భూమిలో కూడా పెంచవచ్చు. ఈ గడ్డి సాగుకి తక్కువ ఖర్చు అవుతుంది. నేపియర్ గడ్డిలో సాధారణ ఆకుపచ్చ గడ్డి కంటే 20% ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అలాగే, 40 శాతం ముడి ఫైబర్ ఇందులో లభిస్తుంది. నేపియర్ గడ్డిని విత్తిన 45 రోజులలో పూర్తిగా తయారవుతుంది. రైతు సోదరులు వేసవిలో పశువులకు నేపియర్ గడ్డిని ఆహారంగా అందిస్తే.. పశువులు మునుపటిలా పాలు ఇస్తూనే ఉంటాయి.

ఇవి కూడా చదవండి

కంబాల మేత: పశుగ్రాసానికి సాగు చేయడానికి భూమి లేని రైతులు.. ఇంటి లోపల కంబాల మేతను పెంచుకోవచ్చు. సరిగ్గా ఫ్రిజ్ లా కనిపించే కంబాల మేత సాగు కోసం వార్డ్ రోబ్ లాంటి నిర్మాణాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ నిర్మాణాన్ని హైడ్రోపోనిక్స్ కంబాలా మెషిన్ అని కూడా అంటారు. ఈ యంత్రంలో గడ్డిని పెంచడానికి వివిధ రకాల అచ్చులను తయారు చేస్తారు. అందులో విత్తనాలను వేసి తద్వారా పచ్చి గడ్డిని సంవత్సరాల తరబడి పెంచవచ్చు. దీనిని పశువులకు మేతగా అందించవచ్చు. దీనిని ఆహారంగా అందిస్తే.. పశువులు మునుపటిలా పాలు ఇస్తూనే ఉంటాయి.

అజొల్లా పశువుల దాణా: అజొల్లా పశువుల దాణా అనేది నీటిపై పెరిగే ఒక రకమైన గడ్డి. ఇది జంతువులకు ప్రోటీన్ సప్లిమెంట్ అని పిలుస్తారు. అజొల్లా పశుగ్రాసంలో మెగ్నీషియం, రాగి, మాంగనీస్, భాస్వరం, ఇనుము,  కాల్షియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దీనితో పాటు, పాల ఉత్పత్తిని పెంచే అమైనో ఆమ్లాలు, ప్రోబయోటిక్స్, బయో-పాలిమర్లతో సహా అనేక రకాల విటమిన్లు కూడా ఈ పశుగ్రాసంలో అధికంగా ఉంటాయి.  అజొల్లా దాణాను పశువులకు ఆహారం ఇవ్వడం ద్వారా ఎక్కువ  పాలు ఇస్తూనే ఉంటాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు!
విజయనగరంలో అర్ధరాత్రి సెగలు.. కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు!
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్