- Telugu News Photo Gallery Spiritual photos Miracle happening from past 1600 years, Shiva Abhishek Ghee Turns Butter Shiva Gange Temple
సైన్ కు సవాల్ ఈ ఆలయం.. 1600 ఏళ్లుగా అభిషేకం చేసే నెయ్యి వెన్నగా మారే అద్భుతం.. శివగంగ దివ్య క్షేత్రం
భారతదేశం పురాతన నాగరికతలు, గొప్ప సంస్కృతి, ఇతిహాసాలున్న అద్భుతమైన దేశం. ప్రపంచంలోనే అత్యంత అందమైన, సాంప్రదాయ దేవాలయాలకు నిలయం. ప్రతి ఆలయంలో మర్మమైన విషయాలు, అంతుపట్టని రహస్యాలకు నెలవు. కొన్ని ప్రదేశాలను సందర్శించడం ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్స్ కు సవాల్ విసురుతూనే ఉన్నాయి. అలాంటి అద్భుత ఆలయంలో ఒకటి కర్ణాటకలో ఉంది. గంగాధరేశ్వర స్వామి ఆలయం లో కొన్ని వందల ఏళ్ల నుంచి జరుగుతున్న అద్భుతం సైన్స్ కు అందని వాస్తవం.
Surya Kala | Edited By: Ravi Kiran
Updated on: Jun 10, 2023 | 1:31 PM

నెయ్యితో శివ లింగానికి అభిషేకం చేస్తే.. ఆ నెయ్యి వెన్నగా మారే అద్భుతానికి నిలయం. ఈ శివాలయంలో '1600' సంవత్సరాల నుంచి జరుగుతున్న అద్భుతం.

సముద్ర మట్టానికి దాదాపు 4,559 అడుగుల ఎత్తులో కర్ణాటకలోని దొబ్బాస్‌పేటలో శివగంగ అనే హిందూ పుణ్యక్షేత్రం ఉంది. ఈ అందమైన పర్వతం శివలింగాన్ని గుర్తుచేసే ఆకారంలో ఉంది. ఇక్కడ స్థానికంగా "గంగా" అని పిలువబడే ఒక నీటిధార ప్రవహిస్తుంది. కొండపై చారిత్రాత్మక శిలమైన నంది లేదా బసవన్న నిటారుగా ఉన్న శిల పైన చెక్కబడినది.

శివగంగలో అగస్త్య తీర్థం, పాతాళ గంగ, కణ్వ తీర్థం, కపిల తీర్థం మొదలైన అనేక తీర్థాలు ఉన్నాయి. అంతేకాదు గంగాధరేశ్వర ఆలయం, శారదాంబే ఆలయం, శ్రీ హొన్నమ్మదేవి ఆలయం కూడా ఉన్నాయి.

ఈ శివ గంగ క్షేత్రంలో గంగాధరేశ్వర ఆలయంలో 1600 సంవత్సరాలకు పైగా ఇక్కడ చాలా అద్భుతం, ఆసక్తికరమైన సంఘటన జరుగుతోంది. ఇక్కడి శివలింగానికి నెయ్యితో లింగాభిషేకం చేసినప్పుడల్లా ఆ నెయ్యి తెల్లటి వెన్నగా మారుతుంది. భక్తులు స్వయంగా ఈ అద్భుతాన్ని చూసి శివయ్య మహిమగా పులకించిపోతారు. అయితే ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు ఎవరూ కనుగొనలేకపోయారు..

అంతేకాదు ఈ వెన్నలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని, ఇది అనారోగ్యాలను నయం చేస్తుందని భక్తులు చెబుతారు. ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సందర్శించి వారి కళ్ళ ముందు జరిగే అద్భుతాన్ని చూసితీరాల్సిందే.

జనవరి నెలలో వచ్చే ప్రతి సంక్రాంతి నాడు శివుడు (గంగాధరేశ్వరుడు), దేవి పార్వతి (హొన్నమ్మ)ల మధ్య కల్యాణం నిర్వహిస్తారు . ఈ సమయంలో పవిత్ర గంగా నది నుండి నీరు కొండపై నుండి వస్తుంది. ఈ నీరునే శివ పార్వతుల పెళ్లిలో ధరే ఆచారానికి ఉపయోగిస్తారు.

పర్వతం చుట్టూ ప్రవహించే నీటిలో స్నానం పుణ్యప్రదమని, సకల పాప హరణమని భక్తులు విశ్వసిస్తారు

సంక్రాంతి సమయంలో జరిగే మరో వింత ఏమిటంటే.. సాయంత్రం సూర్యకాంతి నంది కొమ్ముల మధ్య నుంచి ప్రసరిస్తూ.. ప్రధాన విగ్రహం శివ లింగంపై పడుతుంది. దేవుడి కోసం ఆలయంలో వెలిగించిన దీపం తప్ప వేరే దీపాలు ఉండవు. ఈ వెలుగులో మాత్రమే స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు.

ఈ వింత మన ప్రాచీన వాస్తుశిల్పుల ప్రజ్ఞకు తార్కాణం అని అంటారు. శివగంగ పర్వతం మీద ట్రెక్కింగ్ ఒక అద్భుతం. ఈ పర్వతాన్ని అధిరోహించిన అనుభవం.. తరువాత వీక్షణ పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంది.





























