Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delivery Boy: రోజుకు కోటి సంపాదించే డెలివరీ బాయ్.. నత్తితో ఇబ్బంది పడినా IITని క్రాక్ చేసిన దీపిందర్..

కరోనా మహమ్మారి సమయంలో దీపిందర్ గోయల్ తన డెలివరీ భాగస్వాముల చదువు కోసం నిధులు సమకూర్చడానికి రూ. 700 కోట్ల విలువైన స్టాక్ ను విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో జన్మించాడు. చిన్న తనంలో చదువులో కూడా టాపర్ కాదు. బిలో యావరేజ్ స్టూడెంట్ మాత్రమే..

Delivery Boy: రోజుకు కోటి సంపాదించే డెలివరీ బాయ్.. నత్తితో ఇబ్బంది పడినా  IITని క్రాక్ చేసిన దీపిందర్..
Deepinder Goyal
Follow us
Surya Kala

|

Updated on: Jun 15, 2023 | 4:41 PM

కృషి, పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. పదుగురుకి సూర్తిదాయకంగా నిలుస్తారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు జొమాటో వ్యవస్థాపకుడు మరియు సీఈవో దీపిందర్ గోయల్. వాస్తవంగా జొమాటో అంటే ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెడితే ఇంటికి తీసుకుని వచ్చి ఇస్తారని తెలుసు.. ఇలా ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తులకు కమిషన్ గా డబ్బుని అందిస్తారు. దీంతో ఒకొక్క డెలివరీ బాయ్ దాదాపు రూ, 40 వేల వరకూ సంపాదిస్తారనే తెలుసు.. అయితే కంపెనీ ప్రచారం కోసం అప్పుడప్పుడు స్వయంగా డెలివరీ బాయ్ అవతారం ఎత్తి ఇంటింటికి తిరిగి ఫుడ్ ను డెలివరీ చేసే దీపిందర్ ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు.

అవును దీపిందర్‌ గోయల్‌ జీవితం సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోదు. తన జీవితంలో ఎదురైన అనేక వ్యక్తిగత, వృత్తిపరమైన అడ్డంకులను అధిగమించి విజయం సాధించిన దీపిందర్‌ గోయల్‌  నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. దీపిందర్ ఇప్పటి వరకు చెఫ్‌కార్ట్, అనాకాడెమీతో సహా 16 స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టాడు. అతని నికర సంపద విలువ 2021లో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటింది.

కరోనా మహమ్మారి సమయంలో దీపిందర్ గోయల్ తన డెలివరీ భాగస్వాముల చదువు కోసం నిధులు సమకూర్చడానికి రూ. 700 కోట్ల విలువైన స్టాక్ ను విరాళంగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో జన్మించాడు. చిన్న తనంలో చదువులో కూడా టాపర్ కాదు. బిలో యావరేజ్ స్టూడెంట్ మాత్రమే.. 8వ తరగతిలో  పరీక్ష ఇన్విజిలేటర్ దీపిందర్‌ గోయల్‌ కు సహాయం చేశాడు. దీంతో ఫెయిల్ అవుతాడు అనుకున్న దీపిందర్ 3 వ ర్యాంక్ తో పాస్ అయ్యాడు. ఇదే అతని జీవితంలో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ సంఘటన అతని జీవితాన్నే మార్చేసింది.

ఇవి కూడా చదవండి

తర్వాత దీపిందర్‌ గోయల్‌ పాఠశాలలో ర్యాంక్ హోల్డర్లలో ఒకడుగా నిలిచాడు. ఐఐటీ ప్రిపరేషన్ కోసం  దీపిందర్ ను కుటుంబసభ్యులు చండీగఢ్‌కు పంపించారు. అయితే అక్కడ ఉన్న బ్రైట్ స్టూడెంట్స్ తో తాను పోటీ పడలేనని భావించి ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే తన లక్ష్యం నుంచి దృష్టి మరల్చకుండా.. మళ్ళీ ప్రయత్నం చేసి ఢిల్లీ ఐఐటీలో సీటు సంపాదించుకున్నాడు.

ఇప్పుడు వందలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నా.. దీపిందర్ గోయల్ పరువురి మధ్యకు రావడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు. ఎక్కువగా లో ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తాడు. ముఖ్యంగా దీపిందర్ నత్తిగా మాట్లాడతాడు. దీంతో అతను తన జీవితంలో వ్యక్తిగత సవాలును అనేకం ఎదుర్కొన్నాడు. అయితే తనలో లోపాన్ని కాలక్రమేణా మెరుగుపరచుకున్నాడు. ఎంతో కష్టపడి పదాలు పలకడం నేర్చుకున్నాడు. అయితే ఇప్పటికీ కొన్ని అక్షరాలు పలకడం కష్టముగా భావించేవి ఉన్నాయని దీపిందర్ చెప్పాడు.

జొమాటో 2021లో స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్ అయింది. ఆ తర్వాత గోయల్ నికర విలువ 650 మిలియన్ డాలర్లకు అంటే మన దేశ కరెన్సీలో 5,345 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆ సమయంలో దీపిందర్ Zomatoలో 4.7 శాతం వాటా ఉంది. ప్రస్తుతం దీపిందర్ కంపెనీ నుంచి ఎటువంటి జీతం తీసుకోడం లేదు. కానీ ఈఎస్ఓపీగా రూ.358 కోట్లు అందుకున్నాడు. INC 42 ప్రకారం  FY 22 ప్రారంభం నుండి గోయల్ రూ. 1111.5 కోట్ల విలువైన ESOPలను అందుకున్నారు. ఇది రోజుకు దాదాపు రూ. 1.5 కోట్లు.

దీపిందర్ గోయల్ జీతం వ్యవస్థాపకుడు, CEO గా తన దశాబ్దపు ప్రయాణంలో, గోయల్ తనకంటూ ఒక పేరు సంపాదించడమే కాకుండా భారీగా డబ్బు సంపాదించాడు. అతని ఫుడ్ డెలివరీ కంపెనీ మార్చి 31, 2022తో ముగిసిన అర్ధ సంవత్సరానికి జీతం, ఉద్యోగుల స్టాక్ ఆప్షన్స్ (ESOP) వంటి ఇతర ప్రయోజనాల కోసం రూ.778 కోట్లు ఖర్చు చేసింది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండు అన్న నేచర్ దీపిందర్ గోయల్ సొంతం.. అందుకనే రోజుకు కోటి రుపాయాలు సంపాదిస్తున్నాయా తనను తాను డెలివరీ బాయ్ గా అభివర్ణించుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్ లో పేర్కొన్నాడు. నిజానికి వైఫల్యం ఒక ఎంపిక కాదు. తన గురించి తప్పుగా భావించిన ప్రతి ఒక్కరికి తాను గెలిచి  నిరూపించాడు. అంతేకాదు “నేను చేసే ఏకైక ప్రయత్నం మనుగడ కోసం. నేను పోరాడేది ఒక్కటే. నువ్వు బ్రతికితే గెలుస్తావు” అని చెబుతాడు దీపిందర్.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..