Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmer Success Story: ఎడారి భూమి అర బిగాలో కూరగాయలు పండిస్తూ ఏడాదికి రూ. ఐదు లక్షలు సంపాదిస్తున్న రైతు..

మనదేశంలో ఎడారి అనగానే రాజస్తాన్ గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రజల ప్రధాన జీవనాధారం టెర్రకోట వస్తువులు హస్తకళలు అని చెప్పవచ్చు. అందుకనే చాలామంది రాజస్థాన్ లో పచ్చదనం కనిపించదు అని భావిస్తారు. అయితే ఒక రైతు ఇతర రాష్ట్రాల్లో పండిస్తున్న విధంగానే ఆకు కూరలను, కూరగాయలను పండిస్తూ రోజు రూ. 1000 నుంచి 1500 నికర లాభాన్నీ ఆర్జిస్తున్నాడు.

Farmer Success Story: ఎడారి భూమి అర బిగాలో కూరగాయలు పండిస్తూ ఏడాదికి రూ. ఐదు లక్షలు సంపాదిస్తున్న రైతు..
Farmer Success Story
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2023 | 1:46 PM

నిజమైన బిజినెస్ మ్యాన్ ఎవరంటే ఎడారిలో సైతం ఇసుక అమ్మేవాడు అని సరదాగా వ్యాఖ్యానిస్తారు. అదే విధంగా పంటలు పండవు అన్న చోట కూడా ఆధునిక సాంకేతిక సాయంతో పంటలను పండించవచ్చు అని నేటి రైతులు రుజువు చేస్తున్నారు. తాము పండించిన పంటతో లాభాలను ఆర్జిస్తూ.. సాటి అన్నదాతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మనదేశంలో ఎడారి అనగానే రాజస్తాన్ గుర్తుకొస్తుంది. ఇక్కడ ప్రజల ప్రధాన జీవనాధారం టెర్రకోట వస్తువులు హస్తకళలు అని చెప్పవచ్చు. అందుకనే చాలామంది రాజస్థాన్ లో పచ్చదనం కనిపించదు అని భావిస్తారు. అయితే ఒక రైతు ఇతర రాష్ట్రాల్లో పండిస్తున్న విధంగానే ఆకు కూరలను, కూరగాయలను పండిస్తూ రోజు రూ. 1000 నుంచి 1500 నికర లాభాన్నీ ఆర్జిస్తున్నాడు. ఈ రైతు పండించిన కూరగాయలను స్థానికులు ఎగబడి మరీ కొనుగోలు చేస్తారు. ఈ రోజు ఏడారిలో పంటలు పండిస్తున్న సక్సెస్ రైతు గురించి తెలుసుకుందాం..

ఆజ్ తక్ నివేదిక ప్రకారం.. భిల్వారా జిల్లాకు చెందిన  రైతు పేరు సత్యనారాయణ మాలి. ఇతను తనకున్న ఉన్న అర బిగ భూమిలో పొట్లకాయ, గుమ్మడి, బెండ సాగు చేస్తూ ఏడాదికి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు. పచ్చదనంతో ప్రెష్ గా ఉండే ఇతరని కూరగాయలను కొనుగోలు చేయడానికి ప్రజలు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారంటే అతిశయోక్తి కాదు.  సత్యనారాయణ తన పొలంలో పంటలకు మంచి నీరుని ఉపయోగిస్తారు.. అంతేకాదు సేంద్రీయ పద్దతిలో కూరగాయలను పండిస్తారు. అందుకే ఇతని పొలంలో పండే కూరగాయలు భలే రుచిగా ఉంటాయి.

వ్యవసాయంలో సత్యనారాయణ మాలికి భార్య సంపూర్ణంగా సహకరిస్తుంది. కూరగాయలు విత్తే ముందు పొలాన్ని పంటకు అనుగుణంగా సిద్ధం చేస్తారు. ముందుగా పొలాన్ని మూడు నాలుగు సార్లు దున్నుతామని సత్యనారాయణ మాలి తెలిపారు. అనంతరం నాలుగు ట్రాలీల సేంద్రీయ ఎరువులను పొలంలో వేసి ఆ తర్వాత మళ్లీ పొలం దున్నుతారు. ఇలా చేసిన పొలంలో అడుగు దూరంలో బెండ, పది అడుగుల దూరంలో సొరకాయ, గుమ్మడి తీగలను విత్తుతారు. ఇలా విత్తిన అనంతరం పంటకు తగినంత మంచినీరు అందిస్తారు. విత్తిన 50 రోజుల తర్వాత బెండ, పొట్లకాయ, గుమ్మడికాయల ఉత్పత్తి ప్రారంభమవుతుందని సత్యనారాయణ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మంచి ధర పలికే కూరగాయలు 

నాలుగు నెలల తర్వాత పూర్తి స్థాయిలో కూరగాయలు ఉత్పత్తి మొదలువుతాయని సత్యనారాయణ తెలిపారు.  పంట ఒక్కసారి చేతికి రావడం మొదలు పెట్టిన అనంతరం పొట్లకాయ, గుమ్మడి, బెండ కాయలను అమ్మడం మొదలు పెడతారు. ఇలా కూరగాయలు అమ్మి రోజుకి సుమారు రూ.1500 వరకు సంపాదిస్తున్నాడు. కిలో బెండకాయలు రూ.30కి అమ్ముతుండగా, పొట్లకాయ కిలో రూ.20 ఉంది. ఈ కూరగాయలకు రెండు రోజులకోసారి నీరు అందిస్తే మంచి దిగుబడి వస్తుందని.. ఒకొక్క రోజు కూరగాయల దిగుబడి బాగుంటే రూ 2000 నుంచి 3000 రూపాయల వరకు కూరగాయలు అమ్ముతానని పేర్కొన్నారు. ఇందులో తాను పంట కోసం పెట్టిన పెట్టుబడి పోను రోజుకి 1000 నుంచి 1500 రూపాయల వరకు నికర లాభం వస్తోందని చెప్పారు సత్యనారాయణ.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..