నీతి శాస్త్రాన్ని చాణక్య నీతి అని కూడా పిలుస్తారు. భారతీయ ప్రాచీన తత్వవేత్త , రాజకీయ వ్యూహకర్త, తక్షశిల అధ్యాపకుడు చాణుక్యుడు తన జీవితంలో జరిగిన సంఘటలను ఆధారంగా రచించిన మానవ జీవన సూత్రాల సమాహారంగా కీర్తిగాంచింది. రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, వ్యక్తిగత ప్రవర్తనను మెరుగుపరచడానికి ఈ నియమాలు ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నాయి. ఈ విధానాలలో ఆచార్య చాణక్యుడు ప్రేమ గురించి కూడా ప్రస్తావించాడు.