Scary Video: ఫుల్ స్పీడ్‌తో నడుస్తున్న ఫ్యాన్.. దెబ్బకు గిర్రున తిరిగి వ్యక్తి మీద పడింది.. నెక్ట్స్ సీన్ చూస్తే పడి పడి నవ్వుతారు..
పాము పేరు వింటేనే ఊపిరి ఆగినంత పని అవుతుంది. దానిని చూస్తే చాలు చాలామంది వణికిపోతారు. అలాంటిది ఏకంగా ఇంట్లోకి వస్తే? నేరుగా అది మన ఒడిలో పడితే? పై ప్రాణాకే పైకే పోయినట్లుగా ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పటి వరకు దూరంగా ఉంది..

పాము పేరు వింటేనే ఊపిరి ఆగినంత పని అవుతుంది. దానిని చూస్తే చాలు చాలామంది వణికిపోతారు. అలాంటిది ఏకంగా ఇంట్లోకి వస్తే? నేరుగా అది మన ఒడిలో పడితే? పై ప్రాణాకే పైకే పోయినట్లుగా ఉంటుంది. తాజాగా ఓ వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పటి వరకు దూరంగా ఉంది అనుకుని హ్యాపీగా పామును వీడియో తీస్తుండగా.. అదికాస్తా ఒక్కసారిగా వచ్చి మీద పడింది. దాంతో అతను లబోదిబోమంటూ పరుగులు తీయడం మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంటి సీలింగ్ ఫ్యాన్‌పై పాము కనిపించింది. ఫ్యాన్ చుట్టూ చుట్టుకున్న ఆ పాము.. కిందకు దిగేందకు ప్రయత్నించింది. అయితే, ఫ్యాన్ చాలా స్పీడ్‌గా తిరుగుతుండటంతో దాని ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. ఈ సీన్‌ను ఇంట్లో సోఫాలో కూర్చున్న వ్యక్తి ఫోన్ కెమెరాలో వీడియో తీస్తున్నాడు. అయితే, పాము ప్రయత్నం పలుసార్లు విఫలమవగా.. చివరకు ఫ్యాన్ రెక్కలు బలంగా తగలడంతో అదికాస్తా ఎగిరి వీడియో తీస్తున్న వ్యక్తిపై పడింది. దాంతో హడలిపోయిన అతను బయటకు పరుగులు తీశాడు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది.




ఈ వీడియోను చూసి నెటజిన్లు అవాక్కవుతున్నారు. టైమ్ అంతే బాస్.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి..
View this post on Instagram