Watch Video: కోర్టులో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళలు.. మధ్యలో వచ్చి లాయర్‌నూ దంచేశారుగా..

ఎవరినైనా అడ్డుకోవచ్చు.. ఎవరి జోలికైనా వెళ్లొచ్చు గానీ.. ఆడోళ్ల మధ్య పంచాయితీ అవుతుంటే మాత్రం మధ్యలో వెళ్లొద్దని అంటుంటారు పెద్దలు. కారణం.. మధ్యలో వెళ్లిన వారి వీపు విమానం మోత మోగడం ఖాయం అని అంటారు. తాజాగా కొందరు మహిళలు..

Watch Video: కోర్టులో పొట్టు పొట్టుగా కొట్టుకున్న మహిళలు.. మధ్యలో వచ్చి లాయర్‌నూ దంచేశారుగా..
Woman Fighting
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 17, 2023 | 8:56 PM

ఎవరినైనా అడ్డుకోవచ్చు.. ఎవరి జోలికైనా వెళ్లొచ్చు గానీ.. ఆడోళ్ల మధ్య పంచాయితీ అవుతుంటే మాత్రం మధ్యలో వెళ్లొద్దని అంటుంటారు పెద్దలు. కారణం.. మధ్యలో వెళ్లిన వారి వీపు విమానం మోత మోగడం ఖాయం అని అంటారు. తాజాగా కొందరు మహిళలు కోర్టు హాల్‌లోనే పొట్టు పొట్టుగా కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైగా వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన లాయర్‌ను సైతం కొట్టే ప్రయత్నం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాబోయ్ అని నోరెళ్లబెడుతున్నారు.

లక్నో ఫ్యామిలీ కోర్టులో ఓ విచారణ నిమిత్తం ఇరు వర్గాలకు చెందిన వారు హాజరయ్యారు. మరి కోర్టు ఏం తీర్పు ఇచ్చిందో.. వీరి మధ్య ఏం జరిగిందో గానీ.. ఈ కేసుకు సంబంధించిన మహిళలంతా ముష్టియుద్ధానికి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు కొందరు లాయర్లు ప్రయత్నించగా.. వారు అస్సలు తగ్గలేదు. పైగా, ఓ లాయర్‌ను సైతం కొట్టబోయారు. ఒకరిపై ఒకరు ఎగురుకుంటూ తన్నుకున్నారు. చెప్పులు తెగేలా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. జుట్టు పట్టుకుని నానా రచ్చ క్రియేట్ చేశారు. ఈ సీన్‌ను అంతా కోర్టులోని కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. నెటిజన్ల నుంచి మాంచి రెస్పాండ్స్ వస్తోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..