Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: 12 నెలలు.. 18 మంది అబ్బాయిలతో డేటింగ్.. ఫైనల్‌గా ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..!

గతంలో ప్రేమ వ్యవహారాలు, వ్యక్తిగత సంబంధాల గురించి గుట్టుచప్పుడు కాకుండా ఉండేవారు. స్త్రీ, పురుషుల బంధానికి సంబంధించిన ఏదైనా అంశాన్ని ఇతరుల మధ్య మాట్లాడాలంటే సంకోచించేవారు. సన్నిహితులతో కూడా పంచుకునేవారు కాదు. అలాంటిది నేడు ప్రజల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది.

Viral: 12 నెలలు.. 18 మంది అబ్బాయిలతో డేటింగ్.. ఫైనల్‌గా ఏం చేసిందో తెలిస్తే అవాక్కే..!
Love Affair
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 16, 2023 | 5:14 PM

గతంలో ప్రేమ వ్యవహారాలు, వ్యక్తిగత సంబంధాల గురించి గుట్టుచప్పుడు కాకుండా ఉండేవారు. స్త్రీ, పురుషుల బంధానికి సంబంధించిన ఏదైనా అంశాన్ని ఇతరుల మధ్య మాట్లాడాలంటే సంకోచించేవారు. సన్నిహితులతో కూడా పంచుకునేవారు కాదు. అలాంటిది నేడు ప్రజల్లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. టాపిక్ ఏదైనా బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. పర్సనల్ అంశాలు సైతం యావత్ ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి కూడా తన ప్రేమ కథలకు సంబంధించిన స్టోరీని పంచుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 12 నెలల్లోనే ఏకంగా 18 మంది అబ్బాయిలతో ప్రేమాయణం సాగించింది. ఈ విషయాలను కెమెరా ముందుకు వచ్చి మరీ వివరించింది. సోషల్ మీడియా వేదికగా.. లైవ్ స్ట్రీమింగ్ పెట్టి మరీ.. తన రిలేషన్స్ గురించి వివరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అంబర్ అనే యువతి.. ఒక ఏడాది కాలంలో తాను డేటింగ్‌కు వెళ్లిన అబ్బాయిల పేర్లను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె చెప్పిన వివరాలు చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 2022 సంవత్సరంలో తన రిలేషన్‌షిప్ డేటా మొత్తాన్ని పేర్కొంది. డేటింగ్ సమయంలో తన ప్రియుళ్లు చేసిన ఖర్చు మొదలు.. అన్ని అంశాలను పంచుకుంది.

‘2022 ఏడాది మొత్తంగా 18 మందితో డేటింగ్ వెళ్లాను. వీరందరినీ వివిధ ప్రదేశాలలో కలిశాను. డేట్‌కి వెళ్లినప్పుడు అబ్బాయిలు నా కోసం చాలా ఖర్చు చేసేవారు. అందుకే అబ్బాయిలతో డేట్‌కు వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. డేట్‌కి వెళ్లడం అంటే.. పార్టీ, డిన్నర్, డ్రింకింగ్ మాత్రమే. ఇదే నాకు సరదాను ఇస్తుంది. ఎవరినీ మోసం చేయడం లేదు. వివిధ ప్రదేశాలలో వీరందరినీ కలిశాను. వారితో సరదాగా కాలక్షేపం చేశాను.’ అని చెప్పుకొచ్చింది అంబర్.

ఇవి కూడా చదవండి

అంబర్ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాండ్స్ వస్తోంది. అబ్బాయిలను ఓ రేంజ్‌లో యూజ్ చేసుకుంటున్నావంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. మరికొందరు ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..