Aadhaar Card Update: ఆధార్ కార్డ్ ఫ్రీ అప్‌డేట్ కోసం గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..
ఆధార్ కార్డ్ అప్‌డేట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత పది సంవత్సరాలుగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకోని వారు ఈ నెల 14వ తేదీ వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని,
ఆధార్ కార్డ్ అప్‌డేట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత పది సంవత్సరాలుగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకోని వారు ఈ నెల 14వ తేదీ వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకోవాలని, లేదంటే తదుపరి అప్‌డేషన్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, ఆధార్ అప్‌డేషన్ కోసం లాస్ట్ డేట్‌ను మరో మూడు నెలలు పొడగించింది కేంద్రం ప్రభుత్వం. సెప్టెంబర్ 14వ తేదీ వరకు ఆధార్ కార్డ్ అప్‌డేట్ కోసం గడువు పెంచారు. తమ ఆధార్ కార్డును ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు UIDAI అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in ని సందర్శించవచ్చు.
ఆధార్ కార్డు అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు చాలా మంది తమ ఆధార్ కార్డుల్లో వివరాలను అప్‌డేట్ చేసుకోలేదు. అయితే, వివరాలు అప్‌డేట్ చేసుకోకపోవడం వల్ల మోసాలు జరిగే అవకాశం ఉందన్న.. వివరాలు అప్‌డేట్ చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ఫిబ్రవరి 2న ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా గడువు ముగిసింది. ఇప్పటికీ చాలా మంది ప్రజలు తమ ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోలేదు. దాంతో డేట్‌ను మరో మూడు నెలలు గడువు పెంచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..