AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Workout Tips: వేసవిలో వ్యాయామం చేసేటప్పుడు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..

ఆరోగ్యంగానే ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం. ఏ పని అయినా చేయగలం. అందుకే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Summer Workout Tips: వేసవిలో వ్యాయామం చేసేటప్పుడు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి..
Workouts
Shiva Prajapati
|

Updated on: Jun 16, 2023 | 8:00 PM

Share

ఆరోగ్యంగానే ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలం. ఏ పని అయినా చేయగలం. అందుకే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఇందుకోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే, వర్షాకాలం, శీతాకాలంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పక గుర్తించుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఔట్‌డోర్ వ్యాయామలు చేయడం, గంటల తరబడి జిమ్‌లో వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే ఆస్కారం ఉంది. అందుకే.. వేసవిలో వ్యాయామం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు నిపుణులు. మరి ఆ సూచనలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సమయం..

వ్యాయామం చేయడానికి అనువైన సమయాన్ని ఎంచుకోవాలి. సాయంకాలం గానీ, ఉదయం వేళ గానీ వ్యాయామం కోసం సరైన సమయం చూసుకుని వెళ్లాలి. తద్వారా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఉదయం 9 గంటల ముందే వ్యాయామం చేయాలి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత బయటకు వెళితే మంచిది. ఈ సమయాల్లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి.

సరిపడినంత నీరు తాగాలి..

వేసవి కాలంలో వ్యాయామం చేసేటప్పుడు.. శరీరం నుండి చాలా చెమట బయటకు వస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. శరీరంలో నీటికొరత ఏర్పడకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. హైడ్రేటెడ్‌గా ఉండేందుకు తగినంత నీరు తాగాలి. ఉదయం లేవగానే కాఫీ, టీ తాగే బదులు.. నీళ్లు తాగితే మేలు జరుగుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది. ఇందులో కొంత తేనె కలుపుకుని కూడా తాగొచ్చు. దీంతో శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

స్నానం..

వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేయొద్దు. వర్కవుట్ సమయంలో చాలా చెమట పడుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా భారీగా పెరుగుతంది. అలాంటి సమయంలో స్నానం చేయడం వల్ల శరీరంపై దుష్ప్రభావం పడుతుంది. అందుకే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చిన తరువాత స్నానం చేయాలి.

ఎనర్జీ డ్రింక్స్ తాగొద్దు..

వ్యాయామం సమయంలో శరీరంలో శక్తి తగ్గుతుంది. దీని వల్ల ఎనర్జీ కోసం చాలా మంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు. కానీ, ఎనర్జీ డ్రింక్స్‌లో గ్లూకోజ్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. వీటికి బదులుగా సాధారణ నీటిని తాగొచ్చు.

వదులుగా ఉండే దుస్తులు..

వేసవిలో వదులుగా, లేత రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. దీని కారణంగా చర్మానికి గాలి తగులుతుంది. చెమట ఆరిపోతుంది. బిగుతుగా ఉండే, ముదురు రంగు దుస్తులను ధరిస్తే విపరీతమైన వేడి కలుగుతుంది. చికాకుగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..