AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: తింగరోడు చేసిన పాడు పనికి నాలుగు తరాల వారిపై కేసు నమోదైంది.. వివరాలు తెలిస్తే షాకే..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని అహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆసక్తికరమైన కేసు నమోదైంది. తన కూతురును వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిపై19 ఏళ్ల ఓ యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు వేధింపులకు పాల్పడిన 23 ఏళ్ల యువకుడు సహా..

Uttar Pradesh: తింగరోడు చేసిన పాడు పనికి నాలుగు తరాల వారిపై కేసు నమోదైంది.. వివరాలు తెలిస్తే షాకే..
Arrest
Shiva Prajapati
|

Updated on: Jun 17, 2023 | 8:38 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని అహర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆసక్తికరమైన కేసు నమోదైంది. తన కూతురును వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిపై19 ఏళ్ల ఓ యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు వేధింపులకు పాల్పడిన 23 ఏళ్ల యువకుడు సహా.. అతని ఇంట్లోని నాలుగు తరాల వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో 20 ఏళ్ల క్రితం చనిపోయిన 90 ఏళ్ల ముసలాయన కూడా ఉండటం విశేషం.

ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఎందుకు వారందరిపై కేసు నమోదైంది? అహర్ పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 23 ఏళ్ల యువకుడు అహర్ పీఎస్ పరిధిలోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అయితే, పెళ్లి చేసుకుంటానని నమ్మించి 19 ఏళ్ల యువతిని ట్రాప్‌ చేశాడు. రెండేళ్లపాటు ఆమెతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేశాడు. అయితే, ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలంటూ యువతి తన ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది. ఈ క్రమంలో 2023 మే 31న యువతిని మాట్లాడుదామంటూ తర వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి, అక్కడ అత్యాచారం చేశాడు. ఆ తరువాత పెళ్లి పేరు ఎత్తితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టాడు యువకుడు. దాంతో తాను మోసపోయానని గుర్తించిన యువతి.. జరిగిన విషయాన్ని ఇటీవల తన ఇంట్లో వారికి చెప్పింది. దాంతో యువతి తండ్రి, తన కూతురును వెంటబెట్టుకుని.. యువకుడిని ఇంటికి వెళ్లాడు. యువకుడు, అతని కుటుంబ సభ్యులు.. యువతిపై ఆమె తండ్రిపై తిరగబడ్డారు. వీరిద్దరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అంతేకాదు.. ఈ మ్యాటర్‌ పోలీసుల వరకు వెళితే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

అయితే, బాధిత బాలిక తండ్రి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన వివరాలన్నీ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఎఫ్ఐఆర్‌లో 10 మంది కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేశారు. ఇందులో చనిపోయిన 90 ఏళ్ల వృద్ధుడి పేరు కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!
భారతీయ సంస్కృతికి విదేశీ మహిళ ఫిదా.. బెస్ట్ అంటూ కితాబు!