My India My Life Goals: భూమాతను ప్రేమిస్తేనే సుఖంగా జీవించగలం.. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా సూత్రమిదే..
Forest Man of India Jadav Payeng: ఆయనకు ప్రకృతి, పర్యావరణం అంటే ప్రాణం.. జీవరాశి మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం 42 ఏళ్లుగా మొక్కలు నాటుతూనే ఉన్నారు. వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని సొంతంగా స్థాపించారు.. అందుకే.. ఆయన్ను ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.

Forest Man of India Jadav Payeng: ఆయనకు ప్రకృతి, పర్యావరణం అంటే ప్రాణం.. జీవరాశి మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం 42 ఏళ్లుగా మొక్కలు నాటుతూనే ఉన్నారు. వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతాన్ని సొంతంగా స్థాపించారు.. అందుకే.. ఆయన్ను ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆ పర్యావరణ ప్రేమికుడు ఎవరంటే.. అస్సాంకు చెందిన జాదవ్ మొలాయ్ పాయెంగ్.. 1979లో మొదలైన ఆయన సేవలు.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 1979లో 16 ఏళ్ల బాలుడిగా రోజుకు ఒక మొక్కను నాటడం మొదలుపెట్టిన జాదవ్ మొలాయ్ పాయెంగ్.. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందారు. రోజుకి ఒక మొక్క నాటడం లక్ష్యంతో ముందుకుసాగిన ఆయన ఆలోచన.. వన వృక్షాన్నే స్థాపించేలా చేసింది. 42 ఏళ్లుగా కొనసాగించిన ఈ ఉద్యమంతో జాదవ్ ఒంటి చేత్తో 550 హెక్టార్లకు పైగా అడవిని సృష్టించారు. అస్సాంలో ఎండిన బీడు భూమిని 550 హెక్టార్ల పచ్చని అడవిగా మార్చారు. ప్రస్తుతం 1360 ఎకరాల విస్తీర్ణంలో ములాయి అడవి విస్తరించి ఉంది.. ఈ అటవీ ప్రాంతం ఏనుగులు, ఇతర జంతువులకు ఆవాసంగా ఉంది. పద్మశ్రీ అవార్డు సొంతం చేసుకున్న ఈ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా శక్తి అనంతం.. అద్భుతం..
పర్యావరణ పరిరక్షణ కోసం నడుంబిగించిన.. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్ మొలాయి పాయెంగ్.. తన ప్రయాణం గురించి ఏమన్నారంటే.. ‘‘నా పేరు జాదవ్ పాయెంగ్ .. మారుపేరు మూలా .. ఐ యామ్ ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. 42 ఏళ్లుగా ప్రతి రోజు మొక్కలు నాటుతున్నాను.. ఉదయం మూడింటికి నిద్ర లేస్తాను ఐదింటికి పడవలో అడవికి చేరుకుంటాను. ఫ్యామిలీ అంటే.. ఈ అడవిలోనే పెళ్ళయింది.. మా అబ్బాయి అమ్మాయి కూడా ఇక్కడే పుట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. భూమాతను మనం ప్రేమించాలి. దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు ప్రకృతిని ప్రేమించాలి.. పర్యావరణాన్ని సంరక్షించాలి. అప్పుడే అందరం సుఖంగా జీవనం సాగించగలం. ప్రభుత్వం నన్నుపద్మశ్రీతో సన్మానించింది. అయితే నాకు డబ్బు అవసరం లేదు.. ప్రభుత్వ చేసిన సన్మానం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను.’’ అంటూ పేర్కొన్నారు.
ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే..




ఈ ఏడాది (జూన్ 5 పర్యావరణ దినోత్సవం) 50వ పర్యావరణ దినోత్సవం.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారత ప్రభుత్వం ‘మై ఇండియా – మై లైఫ్ గోల్స్’ పేరుతో లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మూవ్‌మెంట్ – లైఫ్ అనే నినాదంతో పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పర్యావరణ హితం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఉద్యమంలో టీవీ9 సైతం భాగస్వామ్యంగా నిలుస్తున్నందుకు గర్విస్తున్నాం..
మరిన్ని జాతీయ వార్తల కోసం..