అగ్ని జ్వాల అనేది ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎక్సో అంటే విడుదల, థర్మిక్ అంటే వేడి. అంటే.. వేడిని ఉత్పత్తి చేసే ప్రక్రియ మంటల రూపంలో విడుదల అవుతుంది. ఇది రసాయన ప్రక్రియ ద్వారా జరుగుతుంది. వాస్తవానికి అన్ని సేంద్రీయ పదార్థాలు అణువులతో తయారవుతాయి. ఇందులో న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయి. న్యూట్రాన్లు, ప్రోటాన్లు అణువు కేంద్రకాన్ని ఏర్పరుస్తాయి. ఎలక్ట్రాన్లు క్రియారహితం అవుతాయి. మంటలను కలిగించే ఫోటాన్‌లకు శక్తిని బదిలీ చేస్తాయి.