AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat: 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించడమే భారత్ లక్ష్యం.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ

2025 నాటికి క్షయవ్యాధి (టిబి)ని నిర్మూలించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాధికి వ్యతిరేకంగా ఈ ఉద్యమానికి 'ని-క్షయ్ మిత్ర' బాధ్యతలు చేపట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన రేడియో కార్యక్రమం ' మన్ కీ బాత్'లో అన్నారు.

Mann Ki Baat: 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించడమే భారత్ లక్ష్యం.. 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ
PM Modi
Sanjay Kasula
|

Updated on: Jun 18, 2023 | 1:18 PM

Share

PM Modi: మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలతో సంభాషించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇది 102వ ప్రసారం ఇవాళ ఉదయం జరిగింది. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నెలలో చివరి ఆదివారం నిర్వహిస్తారు.. కానీ ఈసారి అది జూన్ 18న మాత్రమే జరిగింది. సాధారణంగా ప్రతి నెలా చివరి ఆదివారం నాడు ‘మన్ కీ బాత్’ మీ ముందుకు వస్తుందని.. అయితే ఈసారి అదివారం ముందు జరుగుతుందని ప్రధాని మోదీ ప్రారంభంలోనే తెలిపారు. పిఎం మోడీ ఇంకా మాట్లాడుతూ, మీ అందరికీ తెలుసు, నేను వచ్చే వారం అమెరికాలో ఉంటాను మరియు అక్కడ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది, కాబట్టి నేను వెళ్ళే ముందు, నేను మీతో మాట్లాడాలి, ఇంతకంటే మంచిది ఏమి ఉంటుంది అని అనుకున్నాను.

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని స్మరించుకుంటూ ప్రధాని మోదీ ఇలా అన్నారు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలతో పాటు, అతని పాలన, అతని నిర్వహణ నైపుణ్యాల నుంచి నేర్చుకోవలసినది చాలా ఉంది. ముఖ్యంగా నీటి నిర్వహణ, నౌకాదళానికి సంబంధించి ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన కృషి గురించి చెప్పుకోవాలన్నారు. నేటికీ భారతదేశ చరిత్రకు గర్వకారణం. అని గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

బిపార్జోయ్ తుఫానును ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ మాట్లాడుతూ, రెండు మూడు రోజుల క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతాన్ని ఎంత పెద్ద తుఫాను తాకిందో చూశాము. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జోయ్ తుఫాను కచ్‌లో భారీ వినాశనానికి కారణమైంది, అయితే కచ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానుతో పోరాడిన ధైర్యం మరియు సంసిద్ధత సమానంగా అపూర్వమైనది.

ఒకప్పుడు రెండు దశాబ్దాల క్రితం సంభవించిన భూకంపం తర్వాత కచ్ ఎప్పటికీ కోలుకోలేదన్నారు. ప్రస్తుతం అదే జిల్లా దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటిగా ఉందని గుర్తు చేశారు. బిపార్జోయ్ తుఫాను కారణంగా ఏర్పడిన విధ్వంసం నుంచి కచ్ ప్రజలు త్వరగా కోలుకుంటారని నేను ఖచ్చితంగా అభిలాషించారు.

2025 నాటికి TB రహిత భారతదేశం

2025 నాటికి టీబీని నిర్మూలించాలని భారత్ సంకల్పించిందని ప్రధాని మోదీ అన్నారు. స్వేచ్ఛా భారతదేశాన్ని తయారు చేయాలనే లక్ష్యం కచ్చితంగా పెద్దదే. ఒకప్పుడు టి.బి. గురించి తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు దూరంగా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అలా లేదు. నేటి సమయంలో T.B. రోగిని కుటుంబంలో సభ్యునిగా చేయడం ద్వారా సహాయం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం