Pulses Rate: దేశంలో తగ్గిన కందిపప్పు ఉత్పత్తి.. కొండెక్కుతున్న ధర.. సామాన్యులు లబోదిబో..

పెరుగుతున్న పప్పుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. పప్పుధాన్యాల నిల్వ పరిమితిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు 10 లక్షల టన్నుల కంది పప్పుని దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దిగుమతి సుంకాన్ని కూడా ప్రభుత్వం తొలగించింది. పప్పు నిల్వ స్టాక్‌ను పర్యవేక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 

Pulses Rate: దేశంలో తగ్గిన కందిపప్పు ఉత్పత్తి.. కొండెక్కుతున్న ధర.. సామాన్యులు లబోదిబో..
Toor Dal Price
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2023 | 11:11 AM

పప్పులు, కూరగాయలు వంటి ఆహార వస్తువుల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. సామాన్యులు ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అంటూ వాపోతున్నారు. పెరుగుతున్న పప్పుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ కందిపప్పు ధర రోజురోజుకీ పెరిగిపోతుంది. గత రెండు నెలల్లోనే కంది పప్పు ధర రూ.30  నుంచి రూ .40 వరకూ పెరిగింది. దీంతో ఇప్పుడు కిలో కందిపప్పు ధర రూ.160 నుంచి రూ.170కి పెరిగింది. అటువంటి పరిస్థితిలో సాధారణ ప్రజల కందిపప్పు కొనాలంటే ఆలోచించే పరిస్థితి నెలకొంది.

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో కందిపప్పు ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే  దేశీయ ఉత్పత్తిలో 7.90 లక్షల టన్నుల తగ్గుదల నమోదైంది. 2022-23 మూడవ ముందస్తు అంచనా ప్రకారం దేశంలో కంది పప్పు ఉత్పత్తి 34.30 లక్షల టన్నులకు తగ్గింది. అయితే వాస్తవానికి ఈ ఏడాది కందిపప్పు ఉత్పత్తి లక్ష్యం 45.50 లక్షల టన్నులుగా నిర్ణయించుకున్నారు. 2021-22 సంవత్సరంలో కంది పప్పు ఉత్పత్తి 42.20 లక్షల టన్నులుగా నమోదైంది. అటువంటి పరిస్థితిలో 2022-23 పంట సీజన్‌లో కందిపప్పు ఉత్పత్తిలో పెరుగుదలను ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇది జరగలేదు.

10 లక్షల టన్నుల కందిపప్పుని దిగుమతి చేసుకోవాలని నిర్ణయం

ఇవి కూడా చదవండి

అయితే పెరుగుతున్న పప్పుల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టింది. పప్పుధాన్యాల నిల్వ పరిమితిని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు 10 లక్షల టన్నుల కంది పప్పుని దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దిగుమతి సుంకాన్ని కూడా ప్రభుత్వం తొలగించింది. పప్పు నిల్వ స్టాక్‌ను పర్యవేక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఏడాదిలో ఏఏ దేశాల నుంచి ఎంత మేర పప్పులను దిగుమతి చేసుకుంటుందంటే..

పప్పుధాన్యాల విషయంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది. భారతదేశంలో పప్పులకు ఉన్నడిమాండ్‌ మేరకు ఉత్పత్తి జరగడం లేదు. ఇతర దేశాల నుండి ప్రతి సంవత్సరం వేల కోట్ల విలువైన పప్పులను దిగుమతి చేసుకుంటుంది. మన దేశం 2020-21 సంవత్సరంలో విదేశాల నుండి 24.66 లక్షల టన్నుల పప్పులను దిగుమతి చేసుకుంది. అదే సమయంలో, 2021-22 సంవత్సరంలో 9.44 శాతం దిగుమతి సంఖ్య పెరుగుదల నమోదైంది. భారతదేశం 2021-22 సంవత్సరంలో ఇతర దేశాల నుండి 26.99 లక్షల టన్నుల పప్పులను కొనుగోలు చేసింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద పప్పుల దిగుమతిదారుగా భారత్‌ అవతరించింది. విశేషమేమిటంటే ఆఫ్రికా దేశాలు, మయన్మార్, కెనడా దేశాల నుంచి భారత్ అత్యధికంగా పప్పులను కొనుగోలు చేస్తుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!