ఈ మూడింటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి పరగడుపున తాగితే.. మీ శరీరం బంగారంలా మెరిసిపోతుంది..!

ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. శరీరంలో ఉండే చెడు కొవ్వు తొలగిపోయి త్వరగా బరువు తగ్గుతారు. ఉదయాన్నే పరగడుపున ఈ డ్రింక్ తాగడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది త్వరగా ఆకలిని కలిగించదు. ఇక బరువు తగ్గాలనుకునే వారు ఈ డ్రింక్ హ్యాపీగా తాగొచ్చు.

ఈ మూడింటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి పరగడుపున తాగితే.. మీ శరీరం బంగారంలా మెరిసిపోతుంది..!
Lemon Cucumber Water
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2023 | 7:02 PM

ఉదయం పూట కాఫీ, టీలు తాగడం చాలా మందికి అలవాటు. అయితే దాని బదులు వేరే డ్రింక్ తాగడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుందని మీకు తెలుసా..? కొందరు వేడినీళ్లు, నిమ్మరసం, తేనె కలిపి తాగుతారు. కానీ, ఇది అంతగా ప్రయోజనకరమైనది కాదంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. ఇందుకు బదులుగా దోసకాయ, పుదీనా ఆకులు, నిమ్మరసం తాగడం వల్ల దీని కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారని చెబుతున్నారు. ఇందుకోసం ఒక పెద్ద పాత్రలో నీళ్లు తీసుకుని అందులో కీర దోసకాయ ముక్కలు, సగం నిమ్మకాయ, కొన్ని పుదీనా ఆకులను తరిగి వేసుకోవాలి. దీనిపై మూతపెట్టి ఒక రాత్రంతా పక్కనపెట్టాలి. ఆ మర్నాడు ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి. క్రమం తప్పకుడా కొద్ది రోజులు ఇలా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఇలా ఒక రాత్రంతా నానబెట్టిన ఈ నీరు శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి రోజంతా శరీరం చల్లగా ఉంటుంది. దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. నిమ్మకాయలోని ఆమ్ల గుణాలు మన జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల శరీర ఎదుగుదల మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే చెడు కొవ్వు తొలగిపోయి త్వరగా బరువు తగ్గుతారు. ఉదయాన్నే పరగడుపున ఈ డ్రింక్ తాగడం వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది త్వరగా ఆకలిని కలిగించదు. బరువు తగ్గాలనుకునే వారు ఈ డ్రింక్ హ్యాపీగా తాగొచ్చు.

ఇలా ఈ మూడు పదార్థాలతో తయారు చేసుకున్న నీరు మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడం ద్వారా మాత్రమే మీరు రిఫ్రెష్‌గా, ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజూ ఉదయం ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. మనం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకుని పొడిబారకుండా ఉంచుకుంటే చర్మం మెరుస్తుంది. నిమ్మ, పుదీనా, దోసకాయలను నానబెట్టి తయారుచేసిన డ్రింక్ ను రోజూ తాగితే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోయి ముఖం మెరిసిపోతుంది. నిమ్మకాయ, పుదీనా, దోసకాయతో తయారు చేసిన ఈ స్పెషల్‌ డ్రింక్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రోజూ ఉదయం తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..