మీరు మరింత అందంగా కనిపించాలనుకుంటున్నారా..? అయితే, ఈ చిట్కాలు ప్రయత్నించండి

అందంగా కనిపించాలంటే పౌష్టికాహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. మెరుగైన ఆరోగ్యం, అందం కోసం మీరు మీ ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవటం ఉత్తమం. సమతుల ఆహారం, సరైన నిద్ర, వ్యాయామంతో ఆరోగ్యం, అందం రెండింటీని అతి సులువుగా పొందుతారు.

మీరు మరింత అందంగా కనిపించాలనుకుంటున్నారా..? అయితే, ఈ చిట్కాలు ప్రయత్నించండి
Summer Skin (9)
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2023 | 6:38 PM

మెరిసే చర్మాన్ని పొందడం అంతుచిక్కని రహస్యం కాదు.. లోతైన సైన్స్ అసలే కాదు. మీరు కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే చాలు..మీరు కోరుకున్న అందాన్ని మీరు సులభంగా పొందవచ్చు. మీ చర్మానికి పట్టులాంటి మెరుపు, మెరుగైన అందంతో కనిపించేలా మార్చే ఇలాంటి ఇంటి చిట్కాలను తప్పక పాటించండి.  మీ చర్మం హైడ్రేట్ గా ఉన్నప్పుడు మీ సాధారణంగానే అందంగా కనిపిస్తారు. హైడ్రేట్ ఉండేందుకు మీరు పుష్కలంగా నీళ్లు తాగటం అలవాటు చేసుకోవాలి. శరీరానికి కావాల్సినన్నీ నీళ్లను అందిస్తే..ఆటోమెటిక్ గా మీ ముఖాన్ని హైడ్రేట్ గా ఉంచుకోగలుగుతారు. ఇంకా, మొటిమలు ఏర్పడకుండా శరీరం నుండి విషాన్ని తొలగించేలా..కావాల్సినన్ని నీళ్లు తాగడం వల్ల ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. ఇందుకోసం మీరు రోజంతా కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగటం అవసరం.

శారీరక శ్రమ వల్ల కూడా అందం పెరుగుతుంది. వ్యాయామం చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల చర్మంలోని మృతకణాలకు జీవం పోసుకుని మీ ముఖం ఆరోగ్యంగా కనిపిస్తుంది. ఇంకా ఒత్తిడిని తగ్గించుకోవాలి. మీరు తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు అది మీ ముఖంపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల మీ ముఖం మీద మొటిమలు, డల్ నెస్ వంటి సమస్యలు వస్తాయి.

అందంగా కనిపించాలంటే పౌష్టికాహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. మెరుగైన ఆరోగ్యం, అందం కోసం మీరు మీ ఆహారంలో సీజనల్ పండ్లు, కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవటం ఉత్తమం. సమతుల ఆహారం, సరైన నిద్ర, వ్యాయామంతో ఆరోగ్యం, అందం రెండింటీని అతి సులువుగా పొందుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..