పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలకు టికెట్‌.. లేదంటే..ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ వార్నింగ్‌..

వచ్చే 9 నెలలు అత్యంత కీలకంకానున్నాయని చెప్పారు. ప్రజలకు చేరువుగా ఉండడానికి గడగడపకు బాగా ఉపయోగపడుతుందన్నారు. దీనివల్ల మీ గ్రాఫ్‌ పెరగుతుంది. ఇంతకుముందున్నా.. బ్రహ్మాండమైన మెజార్టీలు తిరిగి మనకే రావాలన్నారు సీఎం జగన్‌. అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని మనం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలకు టికెట్‌.. లేదంటే..ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ వార్నింగ్‌..
CM Jagan
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2023 | 4:21 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు కార్యక్రమం అంత్యంత కీలకం అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. YCP వర్క్‌షాపులో సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డపగడపకూ కార్యక్రమం అత్యంత కీలకం అన్నారు. ఇది అందరికీ చాలా ఉపయోగపడే కార్యక్రమం అన్నారు. దీని ద్వారా పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలను కొనసాగిస్తామని, గ్రాఫ్‌ బాగోలేకపోతే అలాంటి వారిని కొనసాగించడం కుదరదని సీఎం జగన్‌ తేల్చి చెప్పారు. అలాంటి వారిని కొనసాగించడం వల్ల వాళ్లకీ నష్టం, పార్టీకీ కూడా నష్టం వాటిల్లితుందని సీఎం జగన్‌ చెప్పారు. గడపగడపకూ కార్యక్రమం వల్ల గ్రాఫ్ పెరుగుతుందన్నారు. అలా జరగకపోతే.. మార్చక తప్పని పరిస్థితి వస్తుందని చెప్పారు. సర్వేలో ఆయా ఎమ్మెల్యేల గ్రాఫ్‌ అనుకూలంగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వలేమని స్పష్టం చేశారు.

కొన్నికోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. గడగడపకు సర్వే ఆధారంగా కోట్ల మంది పేదవాళ్లకు మంచి జరుగుతుందన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేకపోతే… కొనసాగించడం వల్ల వాళ్లకీ నష్టం, పార్టీకీ కూడా నష్టమే అన్నారు. అంతేకాదు..కోట్లమంది పేదలకు కూడా నష్టం జరుగుతుందన్నారు. సర్వే చేసినప్పుడు మీమీ గ్రాఫ్‌లు బలంగా ఉండాలి. దీనికోసం గడపగడపకూ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువుగా ఉండడానికి గడగడపకు బాగా ఉపయోగపడుతుందన్నారు. దీనివల్ల మీ గ్రాఫ్‌ పెరగుతుంది. ఇంతకుముందున్నా.. బ్రహ్మాండమైన మెజార్టీలు తిరిగి మనకే రావాలన్నారు సీఎం జగన్‌. అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని మనం సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

తీవ్రమైన ఎండల వల్ల కొన్ని ఇబ్బందులున్నాయన్న విషయం వాస్తవే అన్నారు సీఎం జగన్‌. ఇకమీదట గడపగడపకూ కార్యక్రమం ముమ్మరం కావాలన్నారు. సర్వేలు అనుకూలంగా లేకపోతే, టిక్కెట్లు ఇవ్వకపోతే.. నన్ను బాధ్యుడ్ని చేయొద్దని సూచించారు. రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవాలని, గడపగడపకూ కార్యక్రమాన్ని కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలన్నారు. వచ్చే 9 నెలలు అత్యంత కీలకంకానున్నాయని చెప్పారు. మనం ఖచ్చితంగా గెలవాలి.. 175కి 175 సీట్లు రావాలంటూ పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..