మెడికల్‌ కాలేజీలు టార్గెట్‌గా ఈడీ సోదాలు.. తెలంగాణ వ్యాప్తంగా 15 చోట్ల తనిఖీలు..

తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. SVS, కామినేని సహా పలు మెడికల్‌ కాలేజీల్లో తనిఖీలు చేపట్టింది ఈడీ. కామినేని హాస్పిటల్స్‌ గ్రూప్‌పై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. భారీ సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు ఈడీ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో ఈడీ దాడులు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మెడికల్‌ కాలేజీలు టార్గెట్‌గా ఈడీ సోదాలు.. తెలంగాణ వ్యాప్తంగా 15 చోట్ల తనిఖీలు..
Ed Raids
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2023 | 3:11 PM

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవల పలువురు బీఆర్ఎస్ నేతల ఇళ్లు, ఆఫీసులపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. పలువురిని విచారణకు ఆదేశిస్తూ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక ఇప్పుడు మెడికల్‌ కాలేజీలు టార్గెట్‌గా ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణలో మొత్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. SVS, కామినేని సహా పలు మెడికల్‌ కాలేజీల్లో తనిఖీలు చేపట్టింది ఈడీ. కామినేని హాస్పిటల్స్‌ గ్రూప్‌పై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

కామినేని గ్రూప్ చైర్మన్,ఎండీ నివాసాలపై సోదాలు జరుగుతున్నాయి. శశిధర్‌ కామినేని, వసుంధర కామినేని, కామినేని సూర్యనారాయణ, గాయత్రిదేవి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. కింగ్‌కోఠిలోని కామినేని ప్రధాన కార్యాలయంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి.  బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు 11 బృందాలుగా బయలుదేరారు.

భారీ సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు ఈడీ బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్, ఖమ్మం జిల్లాల్లో ఈడీ దాడులు చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..