Viral Video: వార్నీ ఇదేం యోగారా సామీ.. మరెక్కడా కుదరట్టు.. కాస్త కాలు జారితే ఉంటదీ..!!

సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన వినియోగదారులు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక వినియోగదారు దేశీ హీరో అంటుండగా, మరొక వినియోగదారు దీనిని 'స్టేజ్ పర్ఫామెన్స్‌ అంటారని కామెంట్‌ చేశారు.

Viral Video: వార్నీ ఇదేం యోగారా సామీ.. మరెక్కడా కుదరట్టు.. కాస్త కాలు జారితే ఉంటదీ..!!
Person Climbed The Signboar
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2023 | 4:35 PM

జూన్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ పాత వీడియో సోషల్ మీడి యాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేక్కడి పైత్యంరా సామీ అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే..ఎవరైనా ఇంట్లో, జిమ్‌లో, పార్కులో చేస్తుంటారు. కానీ, వైరల్‌ అవుతోన్న వీడియోలో మాత్రం ఒక వ్యక్తి రోడ్డుపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డుపై పుష్‌అప్‌లు చేస్తూ కనిపించాడు. ఈ వింత సంఘటన ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజానికి ఈ వ్యక్తి రోడ్డుపై వేసిన సైన్ బోర్డుపైకి ఎక్కి పుషప్‌లు చేయడం చూసిన స్థానికులు, వాహనదారులు బెంబేలెత్తిపోయారు. అతడిని వింతగా చూస్తుండిపోయారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురయ్యారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి అర్ధనగ్నంగా ఉండి రోడ్డుపై ఏర్పాటు చేసిన సైన్‌ బోర్డుపై ఎక్కి పుష్‌ అప్స్‌ చేస్తున్నాడు. అతన్ని చూసిన వాహనదారులు తమ వాహనాలను ఆపి మరీ అతన్నే చూస్తుండిపోయారు. కానీ అతను పుష్-అప్స్ చేస్తూనే ఉన్నాడు. అతన్ని అలా చూస్తుంటేనే ఒళ్లు భయంతో కంపిస్తుంది. ఎందుకంటే అంత ఎత్తులో ఒక సన్నని ఆధారంపై అతడు ఎలాంటి భయం లేకుండా పుష్‌అప్స్‌ చేస్తున్నాడు. అది ఎంత ప్రమాదకరమో వీడియోలో మీరే చూడండి. ఏ మాత్రం కాలు జారినా, చేయి జారినా ప్రాణాలకే ప్రమాదంగా ఉంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన వినియోగదారులు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఒక వినియోగదారు దేశీ హీరో అంటుండగా, మరొక వినియోగదారు దీనిని ‘స్టేజ్ పర్ఫామెన్స్‌ అంటారని కామెంట్‌ చేశారు. మరోకరు అతడు బాహుషా.. మద్యం మత్తు ఉన్నాడేమో అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియో పాతదే అయినా యోగా దినోత్సవం రోజున మళ్లీ వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..