Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విడాకుల కేసులో విచిత్ర సంఘటన.. భార్యకు భరణంగా ఏడు బస్తాల పైసలిచ్చిన మొగుడు.. ట్విస్ట్ ఏంటంటే..

ఏడు బస్తాల్లో ఉన్నవన్నీ రూ.1, రూ.2 నాణేలురూపంలో మొత్తం రూ.55 వేల రూపాయలు. కాగా, భర్త చేసిన ఈ వింతపనిపై సీమా ఆవేదన వ్యక్తం చేసింది. తనను మానసిక హింసగా వేధించేందుకే దశరథ్‌ ఇలా చేశాడంటూ భార్య ఆరోపించింది. ఇది మానవత్వం కాదని ఆమె తరఫు న్యాయవాది అన్నారు. ఈ మొత్తాన్ని లెక్కించేందుకు 10 రోజుల సమయం పడుతుందని కోర్టు పేర్కొంది. కానీ,

విడాకుల కేసులో విచిత్ర సంఘటన.. భార్యకు భరణంగా ఏడు బస్తాల పైసలిచ్చిన మొగుడు.. ట్విస్ట్ ఏంటంటే..
Indian Currency
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2023 | 6:36 PM

రాజస్థాన్ జైపూర్‌లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఒక జంటకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. తీర్పులో భాగంగా, భార్యకు భర్త నుండి భరణం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే కోర్టులో ఎవరూ ఊహించని విధంగా ఈ కేసులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. విడాకులతో భార్యకు భరణం ఇచ్చేందుకు ఆ భర్త ఏడు బస్తాల చిల్లర నాణేలతో కోర్టుకు వచ్చాడు. భార్య భర్తలకు విడాకులు ఇప్పించిన కోర్టు.. ఆ భర్త తన బార్యకు మెయింటెనెన్స్‌ కింద రూ. 55వేలు భరణం ఇచ్చేలా కోర్టు తీర్పు వెల్లడించింది. భార్యకు భరణం అందించాలన్న ఆదేశానికి అనుగుణంగా అతడు ఏడు బస్తాల్లో రూ. 55 వేల రూపాయల విలువైన చిల్లర నాణేలను కోర్టులో డిపాజిట్ చేశాడు. అయితే, ఆ చిల్లర మొత్తం లెక్కించేందుకు సుమారు 10 రోజులు పడుతుందని కోర్టు తెలిపింది. సమయాభావం కారణంగా నాణేలను లెక్కించకపోగా.. జూన్ 26న లెక్కించాలని కోర్టు ఆదేశించింది. కోర్టులో నిందితుడు భర్త ప్రవర్తన చూసి అందరూ షాక్ అయ్యారు.

జైపూర్‌కు చెందిన దశరథ్ కుమావత్‌కు కొన్నేళ్ల క్రితం సీమా అనే మహిళతో వివాహమైంది. అయితే, కొన్నాళ్లపాటు సాఫీగానే సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య తరచూ గొడవలు, విభేదాలు రావడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. అయితే, భనకత దశరథ్‌ నుంచి విడిపోయిన సీమా కుమావత్‌కు నిర్వహణ ఖర్చుల కింద నెలకు రూ.5,000 చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే, గత 11 నెలలుగా అతడు ఆ డబ్బు ఇవ్వలేదు. దీంతో సీమ మళ్లీ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు అతడికి రికవరీ వారెంట్ జారీ చేసింది.

అయితే దశరథ్ డబ్బు చెల్లించేందుకు నిరాకరించడంతో.. జూన్ 17న కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మంగళవారం అదనపు జిల్లా జడ్జి ఎదుట హాజరుపరిచారు. దశరథ్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని కుటుంబ సభ్యులు సీమకు రావాల్సిన సొమ్మును కోర్టుకు తీసుకొచ్చారు. అవన్నీ రూపాయి నాణేలు కావడం చూసి అంతా షాక్‌ తిన్నారు. ఏడు బస్తాల్లో ఉన్నవన్నీ రూ.1, రూ.2 నాణేలురూపంలో మొత్తం రూ.55 వేల రూపాయలు. కాగా, భర్త చేసిన ఈ వింతపనిపై సీమా ఆవేదన వ్యక్తం చేసింది. తనను మానసిక హింసగా వేధించేందుకే దశరథ్‌ ఇలా చేశాడంటూ భార్య ఆరోపించింది. ఇది మానవత్వం కాదని ఆమె తరఫు న్యాయవాది అన్నారు. ఈ మొత్తాన్ని లెక్కించేందుకు 10 రోజుల సమయం పడుతుందని కోర్టు పేర్కొంది. కానీ, ఇది చెల్లుబాటయ్యే భారత కరెన్సీ అని దశరథ్‌ తరపు న్యాయవాది తెలిపారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఏడు బస్తాల్లో తీసుకొచ్చిన రూ.55 వేల నాణేలను కోర్టులో సమర్పించారు. అవన్నీ దేశంలో చెల్లుబాటు అయ్యే కరెన్సీనే కాబ్టటి. ఈ మొత్తాన్ని అంగీకరించాల్సిందేనని కోర్టుకు విన్నవించుకున్నాడు. అందుకు అంగీకరించిన కోర్టు ఓ షరతు విధించారు. వాటన్నింటిని తానే స్వయంగా లెక్కించాలంటూ చివర్లో గట్టి ట్విస్ట్ ఇచ్చింది. కేసు విచారణను జూన్ 26కి వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ డబ్బు కోర్టు కస్టడీలో ఉంటుంది. విచారణ రోజున దశరథ్ స్వయంగా డబ్బును లెక్కించి ఒక్కొక్కటి రూ.1000 ప్యాకెట్లుగా విభజించాలి. ఆ ప్యాకెట్లను కోర్టులో భార్యకు అప్పగించాలని కోర్టు స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..