మామిడి పండులోని జీడి కూడా దివ్యౌషధమే..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అలా పడేయారు..

అవును, మామిడి పండు టెంకలోని జీడి ప్రత్యేకత గురించి మీకు తెలుసా..? మామిడి టెంకలోని పుడక పురాతన కాలం నుండి అనేక ఆయుర్వేద మందులు, కొన్ని చికిత్సలలో ఉపయోగిస్తుంటారని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మామిడి టెంకలోని పుడకలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి

మామిడి పండులోని జీడి కూడా దివ్యౌషధమే..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అలా పడేయారు..
Mango Seeds
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 21, 2023 | 5:19 PM

మామిడి పేరు చెబితేనే చాలా మందికి నోరు ఊరూరుతుంది. పైగా ఇది మామిడి సీజన్‌. మామిడిప్రియులు రోజుకు ఎన్నిపండ్లు తింటారో కూడా లెక్కించకపోవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా దాని టెంకను తొలగించారా..? అవును, మామిడి పండు టెంకలోని జీడి ప్రత్యేకత గురించి మీకు తెలుసా..? మామిడి టెంకలోని పుడక పురాతన కాలం నుండి అనేక ఆయుర్వేద మందులు, కొన్ని చికిత్సలలో ఉపయోగిస్తుంటారని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మామిడి టెంకలోని పుడకలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వాపుతో పోరాడటానికి, జీవక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ సారి మీరు జ్యుసి మామిడిని ఆస్వాదించిన తర్వాత దాని టెంకను బయటకు విసిరే ముందు ఒకసారి దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి..

మామిడి పండు మధ్యలో పీచుతో కూడిన విత్తనం ఉంటుంది. ఇది డయేరియా, ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులలో సహాయపడుతుంది. అంతేకాదు.. దీంతో నూనె కూడా తయారు చేస్తారు. ఈ నూనెతో చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించవచ్చు. ఈ నూనె ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ఖనిజాలు, విటమిన్ల అధికంగా ఉంటాయి. అయితే మీరు మీ ఇంట్లోనే ఈ నూనెను ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా, మామిడి టెంక బయటి పొరను తొలగించి.. ఆ జీడిని తీసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి, ఆలివ్, నువ్వులు లేదా ఆవాల నూనెతో కలపాలి. దీన్ని ఒక గాజు సీసాలో పోయాలి. ఈ మిశ్రమాన్ని సూర్యకాంతిలో ఒక వారం పాటు ఉంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తలకు అప్లై చేసుకోవటం వల్ల జుట్టు రాలడం, నెరిసిపోయిన జుట్టు సమస్యకు చెక్‌ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కొద్ది రోజుల్లోనే మీ జుట్టు నల్లగా, పొడవుగా, మందంగా మారటం గమనిస్తారు.

మామిడిలోని జీడిని మెత్తగా గ్రైండ్‌ చేసుకుని.. దానికి ఆవాల నూనె లేదా కొబ్బరి నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. మామిడికాయ జీడితో పొడి తయారు చేసి రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు..రక్తంలో చక్కెరను తగ్గించడంలో మామిడి జీడి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇవి గ్లూకోజ్ శోషణను తగ్గించడానికి పేగు, కాలేయ ఎంజైమ్‌లను మారుస్తాయి. ఇది శరీర కొవ్వు, బరువు, నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

మామిడికాయలో జీడితో పొడితో దంతాలకు కూడా మేలు కలుగుతుంది. మామిడి జీడిని పౌడర్‌లా చేసుకుని రెగ్యూలర్‌గా బ్రష్‌ చేసుకోవటం వల్ల మీ దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పొడిని యాలకుల పొడితో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. ఇందుకోసం మామిడి జీడిని నీడలో ఎండబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. 1-2 గ్రాముల తేనెతో కలిపి తినాలి. ఈ పొడిని నీటిలో కలిపి తాగటం వల్ల బరువును క్రమంగా తగ్గించుకోవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మామిడి జీది పొడి రక్త ప్రసరణను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర, సి-రియాక్టివ్ ప్రోటీన్ స్థాయిలు, జీర్ణక్రియను తగ్గించడంలో పరోక్షంగా సహాయపడుతుంది. మామిడి జీడితో తయారు చేసిన నూనె ఒక అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మామిడి జీడి నూనె మీ చర్మానికి పోషణ, తేమను అందించడానికి అనేక లోషన్లలో ఉపయోగిస్తారు.

మామిడి జీడిని మెత్తగా దంచి టమాటా కలపాలి. దీన్ని మీ ముఖంపై అప్లై చేయండి. ఈ స్క్రబ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, బ్లాక్‌హెడ్స్, మొటిమలు, మచ్చలను నయం చేయడానికి, ముఖంపై ఏర్పడ్డ రంద్రాలను ఫిల్‌ చేయడానికి, ఎరుపును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..