Viral Video: ‘కూలీ నెంబర్ 1’.. స్మార్ట్ ఐడియాకు సలామ్ కొడుతున్న నెటిజన్లు.. వీడియో చూస్తే షాకే..
'కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు కానీ, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు' అనే డైలాగ్ మనకు బాగా తెలిసిందే. ఇది డైలాగ్ మాత్రమే కాదు.. కొందరిని చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. బుర్రను కాప్త ఉపయోగిస్తే.. ఎంతటి కష్టమైన పని అయినా చాలా ఈజీగా చేసేయొచ్చు.

‘కళ్లు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు కానీ, దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు’ అనే డైలాగ్ మనకు బాగా తెలిసిందే. ఇది డైలాగ్ మాత్రమే కాదు.. కొందరిని చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. బుర్రను కాప్త ఉపయోగిస్తే.. ఎంతటి కష్టమైన పని అయినా చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇదే విషయాన్ని నిరూపించే ఓ సూపర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ చేయాలంటూ.. కొందరు కూలీలు కూడా చాలా స్మార్ట్‌గా తమ పనులను పూర్తి చేస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఓ కూలీ ఇదే పని చేశాడు. అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.
గుట్ట పైకి మెట్ల మార్గంలా ఉంది. మెట్ల మార్గాన్ని రెండుగా విభజిస్తూ అంటే వచ్చే వారు, పోయే వారి కోసం మధ్యలో ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఈ గ్రిల్స్ సాయంతో ఓ కూలీ చాలా స్మార్ట్‌గా తన పనిని పూర్తి చేశాడు. తలపై ఓ పార్శిల్ బాక్స్ పెట్టుకున్నకూలీ.. రైయిలింగ్‌పై జారుకుంటూ కిందకు వెళ్లాడు. రెయిలింగ్‌ను లిఫ్ట్ మాదిరిగా ఉపయోగించుకున్నాడు ఆ కూలీ. ఈ దృశ్యాన్ని పర్యాటకులు తమ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. దానిని ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆ కూలీ స్మార్ట్ ఐడియా చూసి నెటజిన్లు ఫిదా అయిపోతున్నారు. ఎంత చదివామన్నది కాదు.. ఎంత తెలివి ఉందన్నది ఇంపార్టెంట్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.




Skillspic.twitter.com/i26gsRr0pD
— The Best (@Figensport) June 23, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..