- Telugu News Photo Gallery Samosa History: Where Did Samosa Come From in India Know Interesting Details
Samosa History: నోరూరించే సమోసా చరిత్ర మీకు తెలుసా? ఇండియాకు ఎలా వచ్చింది? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం..
‘సమోసా’ను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ పేరు వింటేనే నోళ్లలో లాలాజలం ఊరుతుంటుంది. భారతదేశంలో సమోసాలను టీ తాగే సమయంలో గానీ, స్వీట్, గ్రీన్ చట్నీతో గానీ తింటారు. దీనిని సింక్రెటిక్ డిష్ అని పిలుస్తారు. అయితే, మనమంతా ఎంతో ఇష్టంగా తినే సమోసా చరిత్ర ఏంటో తెలుసా? అసలు ఎక్కడి నుంచి మన దేశానికి వచ్చింది? ఇంట్రస్ట్రింగ్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: Jun 24, 2023 | 3:11 PM

ఈ రుచికరమైన సమోసా ఇరాన్ నుంచి ఉజ్బెకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ ద్వారా మన దేశానికి వచ్చిందని చెబుతారు. ఆఫ్ఘనిస్తాన్లో సమోసాలలో డ్రైఫ్రూట్స్‌కు బదులుగా మాంసం, ఉల్లిపాయలను మాత్రమే వేస్తారట. జంతువులను మేపేందుకు అడవికి వెళ్లేవారు వీటిని బాగా తింటారట. అక్కడి అది అలా అలా మన దేశానికి వచ్చేసింది. అయితే, మనం దేశంలో ఇది పూర్తిస్థాయి శాఖాహారంగా మారిపోయింది. మన దేశంలో దీనిని బంగాళదుంపతో తయారు చేస్తారు.

భారతదేశంలో సమోసాను ప్రజలు ఇష్టంగా స్వీకరించారు. కాలంలో పాటు.. సమోసా ఫాస్ట్‌ఫుడ్‌గా మారిపోయింది. మాంసం, బంగాళదుంపలు, ఇతర కూరగాయాలతో ఈ సమోసాలను తయారు చేస్తారు. నల్ల మిరియాలు, సుగంధ ద్రవ్యాలను కూడా ఉపయోగిస్తున్నారు. సమోసాలో ఆలు మసాలా నింపడం పోర్చుగీసు వారి కాలం నుంచే ప్రారంభమైంది.

భారతదేశంలో సమోసాల వ్యాపారం భారీగా సాగుతోంది. అనేక రకాల సమోసాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే, వీటిలో ఎక్కువ భాగం మాత్రం బంగాళదుంపలతో చేసిన సమోసాలే ప్రాచుర్యం పొందాలియ. చోలే సమోసాలు, జామ్ సమోపాలు, నూడుల్స్ సమోసాలు, ఫిష్ సమోసాలు, పాస్తా, పంజాబీ, కీమా, చీజ్, మష్రూమ్, కాలీఫ్లవర్, చాక్లెట్, ఉల్లిపాయ, స్వీట్, చికెన్, పనీర్ సమోసాలు ప్రసిద్ధి చెందాయి.