Smartphone Tips: మీ ఫోన్ హ్యాన్ అయినట్లు అనిపిస్తుందా? ఇలా చెక్ చేసుకోండి..

టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల అటాక్స్ కూడా పెరుగుతన్నాయి. ధనవంతులు, పేదవారు అనే తేడా లేకుండా దోపిడే లక్ష్యంగా జరుగుతున్న హ్యాకింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మొబైల్ స్మార్ట్‌గా మారడమే కాదు..

Smartphone Tips: మీ ఫోన్ హ్యాన్ అయినట్లు అనిపిస్తుందా? ఇలా చెక్ చేసుకోండి..
Hacking
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 24, 2023 | 3:30 PM

టెక్నాలజీ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్ల అటాక్స్ కూడా పెరుగుతన్నాయి. ధనవంతులు, పేదవారు అనే తేడా లేకుండా దోపిడే లక్ష్యంగా జరుగుతున్న హ్యాకింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. మొబైల్ స్మార్ట్‌గా మారడమే కాదు.. హ్యాకర్లు కూడా మరింత స్మార్ట్‌గా రాటుదేలుతున్నారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని మరింత రెచ్చిపోతున్నారు. ప్రస్తుత రోజుల్లో సైబర్ మోసాలు ఎంతగా పెరిగిపోయాయి అంటే హ్యాకర్లకు స్మార్ట్‌ఫోన్‌లను హ్యాక్ చేయడం పెద్ద విషయం కాదు. మొబైల్‌ ఫోన్‌లను హ్యాక్‌ చేసి క్షణాల్లో వారి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును దోచుకుంటున్నారు. మరి మీ ఫోన్ సురక్షితమేనా? మీ ఫోన్ కూడా హ్యాక్ అయినట్లు అనుమానం వస్తుందా? ఈ టిప్స్ ఫాలో అవడం ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. మరి టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

యాంటీవైరస్/యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి..

మీ స్మార్ట్‌ఫోన్‌లో యాంటీవైరస్, యాంటీ మాల్వేర్ స్కానర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఇప్పటికే ఈ యాప్ మీ వద్ద ఉంటే.. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఇవి మీ మొబైల్‌లోని ప్రమాదకరమైన సాఫ్ట్‌వేర్‌లను తొలగిస్తాయి.

ఫోన్‌పై ఓ కన్నేసి ఉంచాలి..

మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లు వాటంతట అవే రన్ అవడం, అధిక బ్యాటరీ వినియోగం, డేటా వినియోగం, ఆడియో రికార్డింగ్, తెలియని మెసేజ్‌లు మొదలైన ఏవైనా అసాధారణ పరిస్థితులు మీకు కనిపిస్తే.. మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురై ఉండొచ్చు.

ఇవి కూడా చదవండి

యాప్, వెర్షన్‌ను చెక్ చేయాలి..

మీ ఫోన్‌లో ఏదైనా కొత్త యాప్‌ డౌన్‌లోడ్ అయినట్లు కనిపిస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి యాప్ ఏదైనా ఉంటే వెంటనే డిలీట్ చేయాలి. ఈ యాప్ ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌లోని మొత్తం డేటా హ్యాకర్ల చేతికి వెళ్తుంది.

ఫోన్ వేడెక్కడం..

వాడక పోయినా ఫోన్ దానంతట అదే వేడెక్కుతోందా? అయితే, జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్ హ్యాక్ అయి ఉండవచ్చు. ఫోన్‌ని ఉపయోగించకున్నప్పటీ వేడెక్కడం అసాధారణం. అయితే, ఫోన్ వేడెక్కడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..