Nothing phone-2: నథింగ్ ఫోన్-2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు లీక్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

ఇప్పటికే నథింగ్ ఫోన్ 1 మార్కెట్లో బజ్ ని క్రియేట్ చేసింది. దానిలో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో నథింగ్ ఫోన్ 2 అంతకు మించే ఉంటుందన్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ క్రమంలో నథింగ్ ఫోన్ 2 కు సంబంధించిన పలు ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.

Nothing phone-2: నథింగ్ ఫోన్-2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు లీక్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Nothing Phone 2
Follow us
Madhu

|

Updated on: Jun 24, 2023 | 4:00 PM

యూకేకి చెందిన స్టార్టప్ కంపెనీ నథింగ్ తన రెండో మోడల్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. నథింగ్ ఫోన్ 2 ను జూలే 11న వర్చువల్ ఈవెంట్లో ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేయాలని సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నథింగ్ ఫోన్ 1 మార్కెట్లో బజ్ ని క్రియేట్ చేసింది. దానిలో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో నథింగ్ ఫోన్ 2 అంతకు మించే ఉంటుందన్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ క్రమంలో నథింగ్ ఫోన్ 2 కు సంబంధించిన పలు ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వంటి వివరాలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. దీనిలో 12జీబీర్యామ్ సైజ్ తో పాటు 512జీబీ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది. అలాగే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జెన్ 1 ఎస్ఓసీ చిప్ సెట్ తో ఉంటుందని చెబుతున్నారు. ఈ కొత్త ఫోన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

నథింగ్ ఫోన్ 2 స్పెసిఫికేషన్‌లు..

నథింగ్ ఫోన్ (2) ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేతో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రంట్ సైడ్ పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను చూడవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో మార్పు కనిపిస్తుందో లేదో తెలియదు. ఈ ఫోన్‌ కొన్ని స్వల్ప మార్పులతో వచ్చే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. బ్యాక్ సైడ్ సెమీ-పారదర్శక డిజైన్‌ను చూడవచ్చు. స్టేబుల్ షాట్‌లకు ఓఐఎస్ కి సపోర్టుతో 50-ఎంపీ ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇతర సెన్సార్ల వివరాలు ఇంకా తెలియరాలేదు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ సాఫ్ట్‌వేర్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే 5,000ఎంఏహెచ్ బ్యాటరీని కూడా చూడవచ్చు. 67వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో పొందవచ్చు.

ధర ఎంత ఉండొచ్చు..

నథింగ్ ఫోన్ 2 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ధర 729 యూరోలు అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ. 65,600 ఉండే అవకాశం ఉంది. 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 849 యూరోలు ఉండే అవకాశం ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 76,500. కాగా నథింగ్ ఫోన్ 1 లాంచింగ్ అప్పుడు రూ. 32,999 కి విక్రయించారు. ఆ తర్వాత దానిపై మరో రూ.1000ని పెంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ