Watch Video: చావులోనూ వీడలేదు.. గుండెను హత్తుకుని తుదిశ్వాస విడిచింది.. ఈ పక్షుల ప్రేమ అమరం..

ప్రేమ.. రెండక్షరాలే అయినా దానిని వర్ణించడం ఎవరితరం కాదు. ఈ ప్రేమ మనుషుల్లోనే కాదు.. ప్రతి జీవరాశిలోనూ చిగురిస్తుంది. జంతువులు, పక్షులు సైతం తమ భాగస్వామిని ప్రేమిస్తాయి. మనుషుల ప్రేమ కన్నా జంతువులు, పక్షుల ప్రేమ మరింత అందంగా, సత్యంగా, శాశ్వతంగా ఉంటుంది.

Watch Video: చావులోనూ వీడలేదు.. గుండెను హత్తుకుని తుదిశ్వాస విడిచింది.. ఈ పక్షుల ప్రేమ అమరం..
Birds True Love
Follow us

|

Updated on: Jun 23, 2023 | 2:03 PM

ప్రేమ.. రెండక్షరాలే అయినా దానిని వర్ణించడం ఎవరితరం కాదు. ఈ ప్రేమ మనుషుల్లోనే కాదు.. ప్రతి జీవరాశిలోనూ చిగురిస్తుంది. జంతువులు, పక్షులు సైతం తమ భాగస్వామిని ప్రేమిస్తాయి. మనుషుల ప్రేమ కన్నా జంతువులు, పక్షుల ప్రేమ మరింత అందంగా, సత్యంగా, శాశ్వతంగా ఉంటుంది. రెండు హృదయాలను కలిపే ప్రేమ.. ఆ హృదయ స్పందన ఆగినప్పటికీ అమరంగా నిలుస్తుంది. అందుకే అంటారు ప్రేమ అమరం, అజరామరం అని. అందుకు నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుండెను పిండేస్తున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు కన్నీరుపెడుతున్నారు.

ఈ వైరల్ వీడియోలో ఓ పక్షి చనిపోయి పడిఉంది. ఆ పక్షి పక్కనే మరో పక్షి రోదిస్తూ, బాధతో నిల్చుంది. చనిపోయిన పక్షి తలపై తన తలపెట్టి విలపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసి ఓ వ్యక్తి చనిపోయిన పక్షిని కాస్త పక్కకు జరుపగా.. మరో పక్షి అస్సలు వీడటం లేదు. మళ్లీ చనిపోయిన పక్షి వద్దకు వచ్చి దాని గుండెలపై తల వాల్చింది. అలా తల వాల్చిన పక్షి.. అక్కడే.. ఆ క్షణమే తన తుదిశ్వాస విడిచింది. ఈ దృశ్యం మనసును పిండేస్తోంది. తన భాగస్వామి లేనిదే తాను ఉండలేనుకుందో ఏమో.. ఆ పక్షి సైతం ప్రాణాలు విడిచింది. ఈ రెండు ప్రేమ పక్షులను సదరు వ్యక్తి ఒకే చోట ఖననం చేశాడు.

ఇవి కూడా చదవండి

కన్నీరు పెట్టిస్తున్న వీడియోను సుశాంతనంద పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. నెటిజన్లు దీనిని చూసి అయ్యో దేవుడా అని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏడుస్తున్నట్లు ఎమోజీలు పెడుతూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రేమను వర్ణించలేమని, నిజమైన ప్రేమకు ఈ ఘటన నిదర్శనం అని పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో